ఉగ్రవాదాన్ని ప్రేరేపించే బోధలు చేస్తున్న ఓ మసీదును ఫ్రాన్స్ మూసేసింది. జిహాద్ కు మద్దతుగా ఉగ్రవాద ప్రసంగాలుండడంతో ఫ్రాన్స్ ఉత్తర ప్రాంతంలో ఉన్న బోవేలోని మసీదును ఆరునెలల పాటు తెరవకూడదని ఆదేశించింది. ఉగ్రవాదులను హీరోలుగా కీర్తిస్తూ…హింసను ప్రేరేపించేలా ప్రసంగాలు చేస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. దేశంలోని చట్టాలకన్నా ఇస్లాం ఆచరణే ముఖ్యమని అతను ప్రసంగిస్తున్నాడని ఆరోపించారు. ఇక తీవ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నాయని అనుమానాలు ఉన్న అన్ని ప్రార్థనా స్థలాల్లోనూ పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు.
అంతకుముందు కూడా హోం మంత్రి గెరాల్డ్ డర్మనిన్ ఓ మసీదును మూసివేయించారు. క్రైస్తవులు, స్వలింగ సంపర్కులు, యూదులను లక్ష్యంగా చేసుకుని ఈ మసీదులో తీవ్రవాద ప్రేరేపిత ప్రసంగాలుంటున్నాయని ఆరోపణలు రావడంతో మూసేశారు.