ఉత్తరప్రదేశ్ లోని సున్నితమైన నగరం మీరట్ లో అద్బుత కార్యక్రమం చోటు చేసుకొంది. సుమారు 150 కుటుంబాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ సోదరీ సోదరులను ఘర్ వాపసీ చేయించారు. దీంతో ఆయా కుటుంబాల్లో సంతోషం వ్యక్తం అవుతోంది. కానీ దీని మీద అక్కడ క్రైస్తవ మిషనరీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
కేరళ కు చెందిన బిజ్జూ మాథ్యూ మీరట్ లో కొంత కాలంగా పెద్ద రాకెట్ నడుపుతున్నారు. ఈ రాకెట్ బట్టబయలు కావటంతో పోలీసులు అరెస్టు చేసి జైలుకి పంపిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీల కాలనీల్లో అతడు నెట్ వర్క్ ఏర్పాటు చేసుకొన్నాడు. ఏసుక్రీస్తుని నమ్మి క్రైస్తవంలోకి అడుగు పెడితే సమస్యలు అన్నీ తీరిపోతాయని ఆయన వాగ్దానం చేస్తాడు. క్రైస్తవంలోకి వచ్చినట్లుగా దరఖాస్తులు నింపాలని కొన్ని ఫారాల మీద వేలిముద్రలు వేయించుకొంటాడు. నిజానికి, అవన్నీ బ్యాంకుల్లో రుణాల కోసం పెట్టుకొనే దరఖాస్తులు. చాలా కాలంగా బ్యాంకుల్లో ఎస్సీ, ఎస్టీలకు కొన్ని రుణాలు తప్పనిసరిగా ఇప్పించాలన్న నిబంధన ఉంది. దీంతో బ్యాంకు అధికారులు లబ్దిదారుల కోసం వెదకుతూ ఉంటారు. మాథ్యూ మనుషులు దీనిని ఉపయోగించుకొని ఎస్సీ యువతీ యువకుల పేరు మీద లోన్స్ పెట్టించేస్తారు. క్రైస్తవంలోకి అడుగు పెట్టిన వెంటనే మీకు డబ్బులు వచ్చేశాయి అంటూ హడావుడి చేస్తారు. ఎస్సీ, ఎస్టీల లోన్స్ కు సంబంధించి దాదాపు 90 శాతం దాకా సబ్సిడీ ఉంటుంది. అందుచేత ఆ డబ్బులు ఎటూ తిరిగి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. ఆ డబ్బుతోనే కొన్ని పరికరాలు కొనిపించి, బ్యాంకు నిబంధనలు ఓకే చేయించుకొంటారు. ఈమాదిరిగా అనేక సంవత్సారాలుగా వేల కుటుంబాలను క్రైస్తవంలోకి మార్చేసినట్లు బయట పడింది. చివరకు బండారం బయట పడటంతో పోలీసులు అరెస్టు చేసి జైలుకి పంపించారు.
Yesterday, I visited Meerut’s Ambedkar Colony, where 30+ families have converted to Christianity
They attended Sunday prayer services at a pastor’s house till his arrest
We organized a Yajna-havan there. Deepest gratitude to those whose support made it possible
A thread 🧵 pic.twitter.com/tNs5d1saJq
— Swati Goel Sharma (@swati_gs) November 11, 2024
ఇప్పుడు ఈ బాధిత కుటుంబాలతో సమరసత తదితర స్వచ్ఛంద సంస్థలు మాట్లాడుతున్నాయి. తిరిగి సనాతన ధర్మంలోకి అడుగు పెట్టాలని ఆహ్వానిస్తున్నాయి. తాజాగా 150 కుటుంబాలకు చెందిన సోదరీ సోదరులు ఘర్ వాపసీ అయ్యారు. ఈ వ్యవహారం మీద క్రైస్తవ మిషనరీలు మండిపడుతున్నాయి. మైనార్టీల హక్కులను లాగేసుకొంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.