ఐటీ మంత్రి పిజ్జా డెలివరీ బాయ్ గా మారాడు. ఆయన నటుడేమో సినిమాలో యాక్ట్ చేస్తున్నాడేమో అనుకునేరు అస్సలు కాదు. ఒకప్పుడు ఐటీ మంత్రిగా దేశంలో నెట్ వర్కింగ్ వ్యవస్థ పురోభివృద్ధికి ఎంతో కృషి చేశాడు సయ్యద్ అహ్మద్ షా సాఅదత్. అలాంటాయన ఇప్పుడు జర్మనీలో ఇల్లిల్లూ తిరిగి పిజ్జాలు అందిస్తున్నాడు. అయితే తన ఈ పరిస్థితికి ఆఫ్గన్ లో తాజా పరిణామాలు మాత్రం కారణం కాదు. గతేడాది దేశాధ్యక్షుడు ఆఫ్రాఫ్ ఘనీతో స్పర్థలు రావడంతో ఆయన తన పదవికి రాజీనామా చేసి జర్మనీ వెళ్లిపోయాడు.అక్కడికెళ్లాక దగ్గరున్న డబ్బు మొత్తం అయిపోవడంతో బతుకుదెరువు కోసం పిజ్జాబాయ్ గా మారాల్సి వచ్చింది. లీప్జిగ్ సిటీలో సైకిల్‌పై వెళ్లి పిజ్జా డెలివరీలు ఇస్తున్న ఆయన్ని స్థానిక మీడియా కదిలించింది. దీంతో తన గురించి వివరాలు చెప్పుకొచ్చాడు.
ఐటీ మంత్రిగా అఫ్ఘానిస్తాన్‌లో సెల్‌ఫోన్ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు ఎంతో కృషి చేశానని చెప్పాడు. తన పరిస్థితిని చూసి కొందరు సానుభూతి తెలుపుతుంటారని ఎవరి సానుభూతీ తనకు అవసరం లేదని…పనిచేసుకుని బతకాడని సిగ్గెందుకని ప్రశ్నిస్తున్నాడు మాజీ ఐటీ మంత్రి. సా అదత్ ప్రస్తుత పరిస్థితికి కారణం తాలిబన్లు కాకున్నా..సాక్షాత్తూ కేంద్రమంత్రిగా పనిచేసిన వ్యక్తికే ఈ పరిస్థితి తలెత్తితే..తాలిబన్ల కారణంగా దేశం విడిచిపోతున్న సామాన్య పరిస్థితేంటనే చర్చ మొదలైంది.