ఎవరు ఈ బిపిన్ రావత్ … దేశమంతా జనం సెర్చ్ చేస్తున్న ప్రశ్న .. ! ఆయన తన కుటుంబ సభ్యులతో , వ్యక్తిగత సిబ్బందితో ప్రయాణిస్తున్న ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ కూనూరు అడవుల్లో కూలిపోవడం , ప్రమాద తీవ్రత దృష్ట్యా అందులో ప్రయాణిస్తున్న వారి పరిస్థితిపై ఆందోళన నెలకొంది … కేంద్ర కేబినెట్ అత్యవసరంగా సమావేశమై ఈ ప్రమాదంపై సమీక్షించింది … బిపిన్ సతీమణి మధూలిక పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది … రావత్ ను మరింత మెరుగైన చికిత్స కోసం తరలించారు … ఈ వార్త రాసే సమయానికి ఛాపర్లో ఉన్న పద్నాలుగు మందిలో 11 మంది మరణించారని ఇండియాటుడే వార్త … రావత్ వెల్లింగ్టన్ మిలిటరీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడనీ సమాచారం . ఇందులో కుట్ర కోణం ఏమీ లేకపోవచ్చునని . సాంకేతిక వైఫల్యం , ప్రతికూల వాతావరణం కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకుందనీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఓ అంచనాకు వచ్చినట్లు చెబుతున్నా .. వాయుసేన దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది . మరో 10 నిమిషాల్లో గమ్యం చేరే పరిస్థితిలో హఠాత్తుగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది . అసలు ఎవరీయన ….
ఈ దేశపు మొట్టమొదటి త్రివిధ దళాధిపతి .. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ … మీకు తెలుసు కదా … మన దేశంలో ఆర్మీ చీఫ్ , నేవీ చీఫ్ , ఎయిర్ ఫోర్స్ చీఫ్ వేర్వేరు … కంబైన్డ్ చీఫ్ ఎవరూ ఉండేవాళ్లు కాదు .. ఆర్మీ చీఫ్ గా పనిచేసిన రావత్ మోడీ ప్రభుత్వం కొత్తగా త్రివిధ దళాధిపతి పోస్ట్ క్రియేట్ చేసి మరీ బాధ్యతలు అప్పగించింది … అంటే మన దేశ రక్షణకు అల్టిమేట్ ఫీల్డ్ బాస్ ఆయన … ఇండియన్ మిలిటరీలో హయ్యెస్ట్ పోస్ట్ .. మూడు విభాగాల నడుమ సరైన సమన్వయం , మార్గదర్శనం . ప్లానింగ్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు … పలు సందర్భాల్లో ప్రత్యర్థి దేశాలకు బలమైన కౌంటర్లు ఇస్తూ , సరిహద్దుల్లో జవాన్లను కలుస్తూ . రావత్ తనదైన ముద్ర వేస్తున్నాడు కొన్నాళ్లుగా … కానీ బ్యాడ్ లక్ .. 63 ఏళ్ల వయస్సులో ఈ అనుకోని ప్రమాదానికి గురయ్యాడు …
1978 లో గూర్ణా రైఫిల్స్ విభాగం సర్వీసులో చేరిన ఆయన పొందని మెడల్స్ లేవు . పరమ విశిష్ట సేవా మెడల్ దాకా అందుకున్నాడు … డిఫెన్స్ స్టడీస్‌లో ఎంఫిల్ చేసిన ఆయన మేనేజ్ మెంట్ . కంప్యూటర్ స్టడీస్‌లో డిప్లొమాలు కూడా పొందాడు … తరువాత మీరట్ యూనివర్శిటీ నుంచి మిలిటరీ – మీడియా స్ట్రాటజిక్ స్టడీస్‌లో రీసెర్చ్ గాను డాక్టరేట్ ఆఫ్ ఫిలాసఫీ తీసుకున్నాడు … ఉత్తరాఖండ్ ఘర్ వాలీ రాజ్ పుత్ కుటుంబానికి చెందిన ఆయన పూర్వీకులు కూడా చాలా తరాలుగా సైన్యానికి సేవలు అందిస్తున్నవారే .. ఈయన తండ్రి లక్ష్మణ్ సింగ్ రావత్ కూడా ఓ లెఫ్టినెంట్ జనరల్ .. ఆయన ప్రయాణిస్తున్నది ఎంఐ సీరీస్ హెలికాప్టర్ .. ఎంఐ -17 వీ – 5- . రష్యన్ మేడ్ … అత్యంతాధునిక మిలిటరీ ఛాపర్ … వీవీఐపీల ప్రయాణాలకు కూడా దీన్నే ఉపయోగిస్తుంటారు ఎక్కువగా … ఎక్కువ ఎత్తులో వెళ్లడానికి , భద్రతకు ఈ ఛాపర్లు నమ్మదగినవి . అని మిలిటరీ ఎక్స్పర్ట్స్ చెబుతుంటారు … ఇండియా ఇలాంటివి 80 చాపర్స్ కొనుగోలు చేసింది …. జంట ఇంజన్లతోపాటు ఆయుధవ్యవస్థను కూడా కలిగి ఉంటాయి .. 2015 లో ఆయన లెఫ్టినెంట్ జనరల్‌గా ఉన్నప్పుడు నాగాలాండ్‌లో చీతా ఛాపర్ ప్రమాదం నుంచి బయటపడ్డాడు . అప్పుడు ఇంజన్ ఫెయిల్యూరే సమస్య . నలభై ఏళ్లుగా ఈ దేశరక్షణలో ఉన్న మన సైన్యాధిపతి క్షేమంగా బయటపడాలని కోరుకుందాం …
Courtesy : MSR
(‘ముచ్చట’ సౌజన్యంతో)