కమెడియన్ మునావర్ ఫరూఖీ షోకు అనుమతి నిరాకరించారు డిల్లీ పోలీసులు. ఈ ఆదివారం షో జరగాల్సి ఉండగా నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఇటీవల హైదరాబాద్ లో మునావర్ షో నేపథ్యంలో నెలకొన్న రగడ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ఆ షోకు అనుమతినిరాకరించారు. హిందు పురాణాలు, దేవీదేవుళ్లను కించపరుస్తూ మునావర్ కామెడీ షోలు చేస్తుంటాడు. అతనిపై పలు హిందుసంఘాలు గతంలో పలుచోట్ల ఫిర్యాదులు కూడా చేశారు. ఏడు నెలలక్రితం కర్నాటక సహా పలురాష్ట్రాల్లో మునావర్ షోను రద్దు చేశారు. అయితే హైదరాబాద్ కు మునావర్ ను ప్రత్యేకంగా ఆహ్వానించారు మంత్రి కేటీఆర్. ఆ షోను అడ్డుకునేందుకు ఎమ్మెల్యే రాజాసింగ్ , సహా పలుహిందుసంఘాలు ప్రయత్నించాయి. అయినా వెనక్కి తగ్గని ప్రభుత్వం, పోలీసులు భారీ బందోబస్తు నడుమ షో నిర్వహించుకునే ఏర్పాట్లు చేశాయి.
హైదరాబాద్ పరిస్థితుల నేపథ్యంలో అతని షో కారణంగా మతపరమైన ఉద్రిక్తతలు చోటుచేసుకోవచ్చని ఢిల్లీపోలీసులు భావించారు. సెంట్రల్ డిస్ట్రిక్ట్ పోలీసుల రిపోర్ట్ ఆధారంగా మునావర్ షో కోసం చేసుకున్న దరఖాస్తును ఢిల్లీ పోలీసులు తిరస్కరించారు. ఈ షోపై ఆగస్టు 25న ఢిల్లీ పోలీస్ కమిషన్ సంజయ్ అరోరాకు విశ్వహిందూ పరిషత్ లేఖ కూడా రాసింది. హిందూ దేవతలను కించపరుస్తూ మాట్లాడిన కమెడీయన్ ఫారూఖీ.. కారణంగా హైదరాబాద్లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయని అందులో ప్రస్తావించింది. ఢిల్లీలో అతని ప్రదర్శనకు అనుమతిస్తే కనుక నిరసనలకు దిగుతామని బజరంగదళ్ సైతం హెచ్చరించింది.
https://twitter.com/ANI/status/1563339820989968385?s=20&t=N096DlGyI0wiZJ3s7lLCUw