జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌లో పూజలు చేసేందుకు అనుమతించాలని కోరుతూ హిందువుల తరఫు దాఖలైన పిటిషన్‌ను వారణాసి జిల్లా కోర్టు విచారణకు స్వీకరించింది. హిందువుల పిటిషన్‌ను సవాలు చేస్తూ ముస్లిం వర్గాలు దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చిన కోర్టు… తదుపరి విచారణను సెప్టెంబర్ 22వ తేదీకి వాయిదా వేసింది.
”పిటిషన్‌ను విచారణకు యోగ్యమైనదిగా భావిస్తూ ముస్లింల తరఫు వాదనను కోర్టు తోసిపుచ్చిందని న్యాయవాది విష్ణుశంకర్ జైన్ తెలిపారు. మసీదు ప్రాంగణంలోని హిందూ దేవతలను పూజించేందుకు అనుమతి కోరుతూ గతంలో కొందరు మహిళలు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రత్యేక కమిటీ వీడియో సర్వే నిర్వహించి కోర్టుకు నివేదిక సమర్పించింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు జ్ఞానవాపి వ్యవహారం జిల్లా కోర్టు ముందు విచారణకు వచ్చింది. కాగా, జ్ఞానవాపి-శ్రింగార్ గౌర్ కేసులో సోమవారం కోర్టు ఆదేశాలు ఇవ్వనుందనే కారణంగా ముందస్తుగా వారణాసిలో నిషేధ ఉత్తర్వులు అమల్లోకి తెచ్చారు. భద్రతను కట్టుదిట్టం చేశారు లక్నో పోలీసులు వారణాసిలో ఫ్లాగ్ మార్చ్ జరిపారు.
Gyanvapi case: Varanasi court upholds maintainability of Hindu side's petition, next hearing on Sep 22
Read @ANI Story | https://t.co/nshw6V3ASU#GyanvapiMosque #GyanvapiVerdict #Gyanvapi #VaranasiCourt pic.twitter.com/SqgUqdhzG8
— ANI Digital (@ani_digital) September 12, 2022
Uttar Pradesh | The court rejected the Muslim side's petition and said the suit is maintainable. The next hearing of the case is on Sep 22: Advocate Vishnu Shankar Jain, representing the Hindu side in the Gyanvapi mosque case pic.twitter.com/EYqF3nxRlT
— ANI UP/Uttarakhand (@ANINewsUP) September 12, 2022