కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ…ఇదే అదనుగా క్రైస్తవ మాఫియా రెచ్చిపోతోంది. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న పేషెంట్ల దగ్గరకు వెళ్లి ప్రలోభపెట్టే మాటలు మాట్లాడుతున్నారు. ఓ మహిళ కొబ్బరినూనెరాస్తే కరోనా తగ్గుతుందంటూ కాకినాడ ఆస్పత్రిలోపలికి వెళ్లి హల్ చల్ చేసింది. అయితే అక్కడున్న యువకులు ఆమెను అడ్డుకుని బయటకి పంపారు. కొన్ని రోజులుగా ఆమె రోజూ వచ్చి రోగులకు మాయమాటలు చెప్పి మతం మార్చే ప్రయత్నం చేస్తోందని తెలిసింది. పేషెంట్లకు కొబ్బరినూనె రాస్తూ ప్రార్థన చేస్తుండగా యువకులు అడ్డుకుని నిలదీశారు. ఆస్పత్రి వర్గాల అనుమతి తీసుకునే వచ్చానని ఆమె చెప్పడంతో అక్కడున్నవాళ్లు అవాక్కయ్యారు. అయితే నిజంగానే ఆస్పత్రి వర్గాలవాళ్లని అడిగే ఈ పనిచేస్తోందా అన్నిది తేలాల్సి ఉంది. కాకినాడలో మాత్రమే కాదు… ఏపీలో చాలా ఆస్పత్రుల్లో క్రైస్తవ బోధకులు బైబిళ్లు, కొబ్బరినూనె బాటిళ్లతో రోగులదగ్గరికి వెళ్లి ప్రలోభపెడుతున్నారు.