ఆంధ్రప్రదేశ్లో అక్రమ చర్చిల వ్యవహారం వివాదాస్పదం అవుతోంది. అక్రమ చర్చిల వివరాలు సేకరించేందుకు ప్రభుత్వ యంత్రాంగం రంగంలోకి దిగింది. కానీ అంతలోనే ప్రభుత్వ పెద్దలు బ్రేక్ వేశారు. దీంతో ఈ ప్రతిపాదన వెనక్కి వెళ్ళిపోయింది . ఇప్పుడు అదే అంశం వివాదంగా మారింది.
……….
వాస్తవానికి చర్చిల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన నియమ నిబంధనలు రూపొందించింది గ్రామస్తుల అభ్యర్థనతో,, జిల్లా కలెక్టర్ అనుమతితో మాత్రమే చర్చిని ఏర్పాటు చేయాలి. లేకపోతే అది అక్రమ నిర్మాణమే అవుతుంది. కానీ చాలా సందర్భాలలో ఈ నిబంధనలు పాటించడం లేదు. స్థానిక రాజకీయ నాయకుల అండ దండాలతో చర్చిలు కట్టేస్తున్నారు. దీనికోసం అధికారులు నేతల దగ్గర నుంచే విరాళాలు సేకరిస్తున్నారు.
……..
మరోవైపు అనేకచోట్ల ప్రభుత్వ భూములను ఆక్రమించి చర్చిలను కట్టేస్తున్నారు. స్థానిక నాయకులకు ఒక మాట చెప్పేసి చర్చి నిర్మాణం చేసేస్తున్నారు. దీన్ని అధికారులు గుర్తించినా.. ఏమీ చేయలేని పరిస్థితి. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం నాయకులు.. స్థానిక అధికారులను అడ్డుకుంటున్నారు. చర్చిల వైపు కన్నెత్తి చూడొద్దు అని రాజకీయ నాయకులు గట్టి ఆదేశాలు ఇస్తున్నారు.
…….
ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లోని చర్చిల వివరాలు తెలియజేయాలని సమాచార హక్కు చట్టం కింద పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు వాసి ఒక పిటిషన్ దాఖలు చేశారు. సమాచార హక్కు చట్టం ప్రకారం పారదర్శకంగా ఆ వివరాలు అందించాల్సిన అవసరం ఉంది. దీంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో… ఎన్ని చర్చిలు ఉన్నాయి,, ఎటువంటి భూముల్లో నిర్మించారు,, అనుమతులు ఉన్నాయా లేదా అన్న వివరాలు సేకరించాలని కోరుతూ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ఒక సర్కులర్ విడుదల చేశారు. చట్ట ప్రకారం సమాచార హక్కు చట్టం పిటిషన్ పడితే,, ఆ పిటిషన్ కు పూర్తిస్థాయిలో సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉంది.
……..
ఈ ఆదేశాలను చూడగానే చర్చి నిర్వాహకులలో కలకలం రేగింది. వేల కోట్ల రూపాయల టర్నోవర్ తో నడుస్తున్న చర్చి వ్యవస్థ దీనిని సీరియస్ గా తీసుకుంది. జాతీయస్థాయిలోని క్రైస్తవ పెద్దల ద్వారా ఏపీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చింది. దీంతో ఆ సర్కులర్ ను రద్దు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వంలోని ఒక కీలక మంత్రి ఇందుకోసం చక్రం తిప్పినట్లు తెలుస్తోంది.
……
దీనిమీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమి స్పందించడం లేదు. దీనిని బట్టి ఒత్తిడి ఏ స్థాయిలో వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.