
రోజురోజుకూ పెరుగుతున్న వంటనూనెల ధరల కట్టడిపై కేంద్రం దృష్టి పెట్టింది. ధరల్ని తగ్గించి సామాన్య ప్రజలకు నూనెలు అందించేందుకు కసరత్తు ప్రారంభించింది. ఈమేరకు కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ కార్యదర్శి …సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. వినియోగదారుల వ్యవహారాల శాఖా కార్యదర్శి, నూనె గింజల ఉత్పత్తిదారులు, మిల్లర్లు, నూనె నిల్వదారులు, వంటనూనెల పరిశ్రమకు చెందిన వారూ ఈ సమావేశంలో పాల్గొన్నారు. వంటనూనెల ధరల పెరుగుదలకు కారణాలు తెలుసుకునేందుకు, పరిష్కార మార్గాల అన్వేషణకు అందరి అభిప్రాయాలు తీసుకుంటామని పౌరసరఫరాల శాఖ కార్యదర్శి తెలిపారు. అంతర్జాతీయంగా కొన్నినెలలుగా పెరిగిన వంటనూనెల ధరలతో పోలిస్తే మన దగ్గర పెరుగుదల ఎక్కువగా ఉంది.
                                                                    



