“ది కశ్మీర్ ఫైల్స్” చిత్రం థియేటర్లలో పరుగులుతీస్తోంది. అంతటా హౌస్ ఫుల్. అయితే వాస్తవాలతో తెరకెక్కిన మూవీకి అనూహ్య ఆదరణ దక్కుతుండడంతో వామపక్ష, ఉదారవాద వర్గాలు తట్టుకోలేకపోతున్నాయి. దీంతో మూకుమ్మడిగా ప్రతికూల ప్రచారం మొదలుపెట్టాయి.. కశ్మీరీ పండిట్లపై దాడులు, మారణహోమాలు వాస్తవం కాదనే ప్రచారం చేస్తున్నారు. వికీపీడియా వెబ్ పేజీ సమాజానికి, మీడియాలోని లెఫ్టిస్టులకు చిత్రంపై ప్రతికూల సమాచారం అందిస్తూ సహాయపడుతోంది. లెఫ్టిస్ట్ ఎడిటర్ ట్రాంగాబెల్లం ఇప్పుడు కాశ్మీర్ ఫైల్స్ చిత్రానికి ప్రతికూల ప్రచారం చేయటంలో నిమగ్నమయ్యారు. అదే లక్ష్యంగా పనిచేస్తున్నారు. వీర సావర్కర్ పుస్తక రచయిత విక్రమ్ సంపత్ వికీ పేజీని ధ్వంసం చేయడంలో ఆమె కీలకపాత్ర పోషించింది .
చిత్రం వికీ పేజీలో తాజాగా చేసిన సవరణల హిస్టరీని చూస్తే… అందులో 23 సవరణలు ట్రాంగాబెల్లం చేసినవే ఉన్నాయి. ఈ సవరణలు మార్చి 14, సాయంత్రం 5 గంటలకు చేసినట్టు ఉంది. వికీపీడియాలో ఏ పేజీ రివిజన్ హిస్టరీ అయినా ఎడిటర్లు జోడించడం, తీసివేసే కథనాలపై ఆధారపడి ఉంటుంది. మార్చి 13, 14 తేదీల్లో ఈ ఎడిటర్ రాసిన 250 కథనాలను గమనిస్తే అందులో 100 కథనాలకు పైబడినవి కశ్మీర్ ఫైల్స్ చిత్రానికి సంబంధించినవే. అంటే చాలా మంది వికీపీడియా ఎడిటర్లు సినిమాపట్ల నిరసన ధోరణితో ఉన్నట్టు అర్దమవుతోంది. చిత్రానికి అనుకూల స్పందనలు వస్తే వాటిని తొలగించినట్లు తాను అంగీకరించింది కూడా.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)