The Blue Communism – Discussion on Mana Desam Mana Rajyam by Nagesh Panchagnula.
చరిత్రలో అణగారిన ప్రజలకి చేయూతనిచ్చి దేశంలో పేదరికాన్ని నిర్ములించే పనిని చేసే వారు ప్రతి దేశం లో వుంటారు. భారత దేశంలో బాబా సాహెబ్ అంబేద్కర్ , అమెరికాలో మార్టిన్ లూథర్ కింగ్ లు ఆలా జీవితాన్ని పరులకు త్యాగం చేసిన వ్వ్యక్తులు.
భారతావని లో బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన సేవలు దేశం ఎప్పటికి మరవదు. భీంరావు గారు ఒక అద్భుత ఎకనామిస్ట్. రాజ్యాంగ రచనలో అయన పాత్ర ముఖ్యమైనది. జీవితాంతం కుల వివక్ష పై పోరాడిన బాబాసాహెబ్ చివరికి హైందవాన్ని వదిలి బౌద్ధానికి వేళ్ళాడే కానీ అబ్రహామిక్ మతాలైన క్రిస్టియానిటీ లేదా ఇస్లాం స్వీకరించలేదు.
ఇటీవలి కాలం లో పేరుకు అయన నామం స్మరిస్తూ దేశభక్తి మరియు సేవాతత్పర లేకుండా కేవలం ఉన్మాదపూర్వకంగా ప్రవర్తించే సంఘాలు కొన్ని భీముణ్ణి తమవాడి గా చెప్పుకుంటున్నాయి. ఇక భారత దేశంలో పుట్టి పరాయి సిద్ధాంతమైన కమ్యూనిజం వెంటపడి వ్యవహారం లో స్వంత లాభిష్టులు అయిన భారత కమ్యూనిస్ట్ లు హఠాత్తుగా బాబాసాహెబ్ ని పైకెత్తుతున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ లలో అగ్రకులాల ఆధిపత్యం చెలాయించే కమ్యూనిస్టులు అంబేద్కర్ గారి మాట ఎత్తటం దుర్యోధనుడు భీముణ్ణి మెచ్చుకున్నట్లు గా వుంది.
అసలు ఈ ఎరుపు రంగు కమ్మీలు ఎలా బాబాసాహెబ్ ని వాడుకొని దేశంలో అశాంతిని సృష్టించ పూనుకుంటున్నారో మా స్పెషల్ షో లో వినండి. May 1st 2017 9:30PM IST/ 12:00PM EST ఏదిఏమైనా బాబాసాహెబ్ నిస్సంకోచ దేశభక్తుడు. ఆయనకి మన దేశం మన రాజ్యం ముఖ్యం.