ప్రపంచంలోనే అతిపెద్ద చేప అయిన ‘వేల్ షార్క్’ విశాఖ తంతడి బీచ్ లో తేలింది. స్థానిక మత్య్సకారుల వలకు చిక్కింది. దాని బరువు సుమారు 2 టన్నులు.. 50 అడుగుల పొడవుంది. మత్య్సకారులు చేపల వేట సాగిస్తుండగా ఓ వలలో ఈ అనుకోని అతిథి వచ్చిపడింది. దీంతో వారు అటవీ అధికారులు, వన్యప్రాణి సంరక్షకులకు సమాచారం ఇచ్చారు.
విశాఖ డీఎఫ్ వో తీరానికి చేరుకుని దాన్ని అతిపెద్ద వేల్ షార్క్ గా నిర్ధారించారు. మత్య్సకారులు, అధికారులు సహా అక్కడున్నవాళ్లంతా తిరిగి సురక్షితంగా షార్క్ ను సముద్రంలోకి పంపారు. అలా 2 టన్నుల ఆ చేప తిరిగి సజీవంగా సాగర ఒడి చేరింది. అది సముద్రంలో తిరిగి స్వేచ్ఛగా ఈదుతోందని అధికారులు తెలిపారు.
మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళినపుడు వలలో వేల్ షార్క్‌లు చిక్కుకుంటే…దాని వల్ల వలలు పాడైతే పరిహారం ఇస్తామని అధికారులు తెలిపారు.