అసోంకి చెందిన శిఖా శర్మ అనే రచయిత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఛత్తీస్గఢ్లో చోటుచేసుకున్న ఎన్కౌంటర్లో 22 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. అయితే సదరు జవాన్లంతా జీతాలు తీసుకుని విధులు నిర్వర్తించారని.. విధుల్లో ప్రాణాలు కోల్పోతే వారిని “అమరులు” అని ఎందుకనాలని.. వారిని “అమరులు” అనకూడదంటూ వ్యాఖ్యానించారు. శిఖా శర్మ తన ఫేస్బుక్లో కూడా ఈ వ్యాఖ్యల్ని పోస్ట్ చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ కార్యకర్తలు.. ఆమెపై స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేసి.. అరెస్ట్ చేశారు. స్థానిక కామరూప్ మెట్రో డిస్ట్రిక్ కోర్టులో హాజరుపరచగా.. కోర్టు ఆమెకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది.
కాగా, శిఖా శర్మ నిత్యం బీజేపీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారని తెలుస్తోంది. అయితే బీజేపీపై విమర్శలు చేయడం రాజకీయం అనుకోవచ్చని.. కానీ ఆమె జవాన్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దేశద్రోహంతో సమానమని జాతీయ వాదులు మండిపడుతున్నారు.