అదానీ గ్రూప్‌పై ఆరోపణలు చేసిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ మళ్లీ విరుచుకుపడింది. ముఖ్యమైన సమస్యల నుంచి దృష్టి మళ్లిస్తున్నారని…అదానీ గ్రూప్‌పై మండిపడింది. హిండెన్‌బర్గ్ ఆరోపణలపై అదానీ గ్రూప్ సమాధానం చెప్తూ, అమెరికన్ షార్ట్ సెల్లర్స్ ‘మడాఫ్స్ ఆఫ్ మన్హటన్’ అని ఆరోపించింది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ బయటకు చెప్పని కారణాలతో ఈ ఆరోపణలు చేసిందని 413 పేజీలతో కూడిన ఈ సమాధానంలో పేర్కొంది. ఆర్థిక ప్రయోజనాల కోసం ఫాల్స్ మార్కెట్‌ను సృష్టించాలనే రహస్య ఎజెండా హిండెన్‌బర్గ్‌కు ఉందని ఆరోపించింది. అయితే అదానీ గ్రూప్ ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందడం లేదని హిండెన్‌బర్గ్ తెలిపింది. అదానీ గ్రూప్ ఇచ్చిన సమాధానంలో కేవలం 30 పేజీల్లో మాత్రమే తాము లేవనెత్తిన అంశాలపై దృష్టి పెట్టిందని, మిగిలినదంతా కోర్టు రికార్డులు, సాధారణ సమాచారం, సంబంధంలేని ఇతర విషయాలేనని పేర్కొంది.