అమెరికా ఎన్నికలు ముగిశాయి ఒక భారత జాతికి చెందిన కమలా హరిస్ వైస్ ప్రెసిడెంట్ పదవిని అధిరోహిస్తారు.
ఆమె ఇప్పుడు వామపక్షం వైపు వున్నారు కాబట్టి ఆమె కులం గుర్తుకు రాదు. ఆమె పూర్వీకులు సనాతన బ్రాహ్మణ కుటుంబానికి చెందివారు. నేటి అభ్యుదయవాదులు కోరుకుంటున్నట్లు ఆమె భారతీయతను, బ్రాహ్మణిజాన్ని ఎప్పుడో చిన్నప్పుడే వదిలేశారు. అభ్యుదయవాదులుచే అంగీకరింపబడడానికి ఇది మొదటి సూత్రం.
ఈమె భారతీయురాలు అని చాలా మంది పోస్టులు పెడుతున్నారు..
ఎవరీ కమలా హారిస్ ? నిజంగా భారతీయురాలా? ఒక సారి చూద్దాం.
ఈమె జమైకాలో జన్మించిన డేవిడ్ హారిస్ మరియు భారత్ లో తమిళ బ్రాహ్మణ కుటుంబం నుండి వచ్చిన డాక్టర్ శ్యామాలా గోపాలన్ కు 1964లో కాలిఫోర్నియా లో జన్మించారు. తల్లి తండ్రులు ఇద్దరూ వేరు వేరు దేశాల నుండి అమెరికా వలస వచ్చారు. ఇద్దరూ వేరు వేరు యూనివర్సిటీ లలో ప్రొఫెసర్లు గా పనిచేసేవారు. తరువాత ఈ జంట 1971లోనే అంటే కమలా 7 సం. ల వయసు ఉండగా విడిపోయారు.
కమలా హారిస్ పేరు మొదటిసారిగా 1994లో బైటికి వచ్చింది. కారణం ఈమెకి విల్లి బ్రౌన్ తో పరిచయం కలగడమే. విల్లి బ్రౌన్ కాలిఫోర్నియా అసెంబ్లీ స్పీకర్. అప్పట్లో కాలిఫోర్నియా లో రెండవ బలమైన నాయకుడు.
బ్రౌన్ మీద విపరీతమైన అవినీతి ఆరోపణల పై విచారణలు జరిగాయి. అప్పటికి బ్రౌన్ వయసు 60 సం. లు కమలా తండ్రి కంటే 2 సం. లు పెద్ద.
కమలా వయసు 30 లోపు. ఈమె బ్రౌన్ తో డేటింగ్ ప్రారంభించింది. 1994లో శాన్ఫ్రాన్సిస్కో లో ఇదే పెద్ద విషయంగా చెప్పుకునేవారు. కమల తల్లి ఈ బంధాన్ని సమర్ధించింది. అతనికి వయసు అయిపోయింది. ఎన్నాళ్ళు ఉంటాడు అని ప్రశ్నించింది.
బ్రౌన్ కమలను ఇన్సూరెన్స్ అపీల్ బోర్డ్ లోనూ, తరువాత లక్ష డాలర్ల కంటే ఎక్కువ జీతంతో ఇంకో పార్ట్ టైం ఉద్యోగిగా వేయించారు. బ్రౌన్ మీద ఆరోపణలు ఎక్కువ రావడంతో FBI దర్యాప్తు చేసింది. థర్డ్ వరల్డ్ కంట్రీస్ లోనే ఇంత అవినీతి ఉంటుంది అని విన్నాను. కాదు ఇక్కడే మన కళ్ళ ముందే కనిపిస్తోంది అని జడ్జి ఈ కేస్ పై వ్యాఖ్యానించారు.
శాంఫ్రాన్సిస్కో మేయర్ ఎన్నికల ప్రచారంలో కమలా హారిస్ ని పూర్తిగా వాడుకున్న బ్రౌన్ తన అలవాటు ప్రకారం కమల హారిస్ ని కూడా తాను శాంఫ్రాన్సిస్కో మొదటి బ్లాక్ మేయర్ గా ఎన్నికైన వెంటనే వదిలేసాడు.
కమల 2003లో శాన్ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్ అటార్నీ ఎన్నికల్లో నిబంధనల కంటే ఎన్నికల ఖర్చు 3 రెట్లు ఎక్కువ పెట్టారని $34000 జరీమాన విధించారు.
కమల ఎక్కువ రోజులు సెక్స్ క్రైమ్ ప్రాసిక్యూటర్ గా చేశారు. 2004-11 శాన్ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్ అటార్నీ గా 2011-17 కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ అటార్నీగా చేశారు. చర్చ్ ప్రీస్ట్స్ మీద చాలా ఆరోపణలు వచ్చేవి. మిగతా నగరాల్లో ఇటువంటి వారికి శిక్షలు పడుతూ ఉండగా కమలా హారిస్ ఉన్న చోట్ల ఒక్క కేస్ పూర్తిగా విచారణ జరగలేదు. ఆ తరువాత జరిగిన విచారణలో సుమారు 40 అతి ముఖ్యమైన ప్రీస్ట్స్ మొ.వారి మీద ఆరోపణల రికార్డ్స్ దొరికాయి. కానీ టైం లిమిటేషన్ దాటిపోవడం వల్ల కేస్ లు ముందుకు సాగలేదు. శాన్ఫ్రాన్సిస్కో ఎన్నికల డిక్లరేషన్స్ ఆధారంగా బయట పడ్డ నిజం ఏమిటంటే ఇటువంటి కేథలిక్ చర్చ్ వారి వద్ద నుండి భారీ మొత్తాలలో కమల హారిస్ కి ఎన్నికల నిధులు అందాయి. ఆ కేసులకు సంబంధించిన రికార్డ్స్ చట్టప్రకారం ఎందరు జర్నలిస్టులు ఎన్నిసార్లు అడిగినా బాధితుల వివరాలు బయటపెట్టకూడదనే సాకుతో ఇవ్వలేదు. చివరిగా 2019లో ఆ రికార్డ్స్ మాయమైపోయినట్లు జవాబు ఇచ్చారు.
కమలా హారిస్ మీద మరొక ఆరోపణ: శాన్ఫ్రాన్సిస్కో అడల్ట్ ఎంటర్టైన్మెంట్ క్లబ్స్ లో
వ్యభిచారం చట్టరీత్యా నేరం. పోలీసులు ఎందరినో పట్టుకొని కేసులు పెట్టినా కమలా హారిస్ ఒక్క కేస్ ఒప్పుకోలేదు. అన్ని కొట్టేసింది. అక్కడ పోలీసులు స్వయంగా తామే విటుల కింద స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి పట్టుకున్న కేసులు కూడా కమలా పట్టించుకోలేదు.
కారణం? ఈ క్లబ్స్ నడుపుతున్న కంపనీ డేవేజు అధినేత కాంటీ కి విల్లీ బ్రౌన్ కి 1977 నుండి అంటే తనకు డెఫిన్స్ అటార్నీ గా పనిచేయడం మొదలుపెట్టిన దగ్గర నుండి 2009లో కాంటీ చనిపోయేవరకు చాలా దగ్గర సంబంధం ఉండేది. విల్లి బ్రౌన్, కమలా సహజీవనం సంగతి అందరికీ తెలిసిందే.
కమలా హారిస్ భర్త కు లా ఫర్మ్ ఉంది. ఆ కంపనీ డీల్ చేస్తున్న ఏ క్లయింట్స్ కేసులు కమలహరిస్ వద్దకు వచ్చినా ఈమె వాటి మీద విచారణ కు ఒప్పుకునేది కాదు అని ఆరోపణలు ఉన్నాయి.
ప్రస్తుతం అమెరికాలో నల్ల వారి మీద దాడులు అన్న అంశం ప్రముఖంగా ఉంది. బహుశా అది ఎన్ కేష్ చేసుకుందికి ఏమో కమలా హారిస్ తనని తాను నల్లజాతి ఆమెగా ప్రకటించుకున్నారు. తండ్రి జమైకా దేశస్తుడు అయినా కమల 7 సం. ల వయసులో ఉండగా తండ్రి విడిపోవడంతో ఆమె తల్లి ఈమెను పెంచారు. ఆమె తల్లి వామపక్ష భావాలు గల హక్కుల ఉద్యమ నేత కూడా. ఆమె తన పిల్లలను భారతీయ సంప్రదాయాల ప్రకారం పెంచలేదు అని చెప్పారు.
ఇప్పుడు జరగబోయే అమెరికా ఎన్నికల్లో కమలా హారిస్ తన నల్లజాతి జన్మను, తన తల్లి భారతదేశ సంబంధాన్ని అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల అస్త్రాలుగా వాడుకున్నారు.
*ఈ వ్యాసంలోని కొన్ని వివరాలు పీటర్స్వీజర్ రాసిన 2020 నెం.1 బెస్ట్ సెల్లర్, “ప్రొఫైల్స్ ఇన్ కరప్షన్: అబ్యూస్ ఆఫ్ పవర్ బై అమెరికాస్ ప్రోగ్రెసివ్ ఎలైట్” అన్న పుస్తకం నుండి, మరి కొంత సమాచారం మిత్రుడు అభి అగర్వాల్ ఇచ్చినది.
…చాడా శాస్త్రి..