దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోతుంది. ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ మహమ్మారి చెలరేగిపోతోంది. దేశ వ్యాప్తంగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా ఇక్కడి నుంచే నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కీలకంగా మారుతోంది. అయితే కేంద్ర ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్లను అందజేస్తున్నప్పటికీ.. అవి సరిపోవడం లేదని రాష్ట్ర అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో భారత్ బయోటెక్ సంస్థ డెవలప్ చేసిన కోవాగ్జిన్ టీకాను ఉత్పత్తి చేయడానికి ముంబైకి చెందిన హాఫ్కిన్ ఇన్స్టిట్యూట్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా, అంతకు ముందు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే ఈ విషయమై కేంద్ర ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. అంతేకాదు.. కరోనాను ప్రకృతి విపత్తుగా పరిగణించాలని కోరారు. ఇలా పరిగణిస్తే ప్రకృతి వైపరిత్యాల నివారణ ఫండ్‌ను ఉపయోగించుకోవచ్చని తెలిపారు. ఇక కేంద్రం కోవాగ్జిన్ ఉత్పత్తికి ముంబై సంస్థకు అనుమతులివ్వడంతో ప్రధాని నరేంద్ర మోదీకి ఉద్దవ్ థాక్రే ధన్యవాదములు తెలిపారు.
#COVID19: Maharashtra CMO says Govt of India has granted approval to Mumbai's Haffkine Institute to produce Bharat Biotech's Covaxin on a transfer of technology basis pic.twitter.com/TR7KaCdkqm
— ANI (@ANI) April 15, 2021