పాకిస్తాన్ దుర్నీతి మరోసారి ప్రపంచదేశాలకు తెలిసివచ్చింది. ఉగ్రవాదులకు మద్దతివ్వడం లేదని ఆదేశ ప్రధాని ఓ వైపు చిలకపలుకులు పలుకుతుంటే పీవోకేలో ఉగ్రవాదులు భారీర్యాలీ తీశారు.
తాలిబన్లకు మద్దతుగా పాక్ ఆక్రమిత కశ్మీర్ లో జైష్, లష్కర్ ఉగ్రవాదులు ర్యాలీలు చేపట్టారు.
తాలిబాన్‌కు మద్దతుగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టిన జైష్-ఇ-మొహమ్మద్ (జేఎం), లష్కరే తోయిబా (ఎల్ఈటీ) ఉగ్రవాదులు…
గాలిలోకి బుల్లెట్లు కాల్చి తమ హర్షాన్ని, ఆమోదాన్ని తెలిపారు. ఇదే సమయంలో నిర్వహించిన బహిరంగ సభలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినట్లు తెలుస్తున్నది. సమావేశాలు జరిగిన అబ్బాస్పూర్, హజీరా, సెన్సా ప్రాంతాలు నియంత్రణ రేఖకు సమీపంలోనే ఉన్నాయి.
ఇదే సందర్భంలో తాలిబాన్ నాయకుడు ముల్లా బరదర్, ఐఎస్ఐ చీఫ్ ఫైజ్ హమీద్ కలిసి ప్రార్థనలు చేస్తున్న ఫొటోలను పలువురు పాకిస్తాన్ జర్నలిస్టులు సోషల్‌మీడియాలో షేర్ చేశారు.