ప్రముఖ పుణ్యక్షేత్రం చిలుకూరు బాలాజీ గుడి అర్చకులు రంగరాజన్ మీద దాడి కలకలం రేపుతోంది. నేరుగా ఆయన ఇంటికి గుంపుగా వెళ్లిన దుండగులు.. ఆయన మీద దాడికి దిగారు. రామరాజ్యం ముసుగులో చేసిన అరాచకం అంతా ఇంతా కాదు. దీని వెనుక భయంకరమైన కుట్ర దాగి ఉంది. అది తెలుసుకోవాలంటే ఈ వీర రాఘవరెడ్డి అసలు చరిత్ర తెలియాలి.
…
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి ప్రాంతం ఫైనాన్స్ వ్యాపారానికి పెట్టింది పేరు. అక్కడ కొంతమంది వ్యాపారులు వడ్డీ వసూళ్లలో పరమ దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంటారు. అనపర్తి రెడ్డి బ్యాచ్ అన్న పేరు చెబితే … మంగళ సూత్రాలు లాగేసే వడ్డీ వ్యాపారులే గుర్తు వస్తారు. అక్కడ కొప్పవరం గ్రామానికి చెందిన వాడే వీర రాఘవరెడ్డి. వడ్డీ వ్యాపారిగా మొదలు పెట్టి కిరాతకంగా వడ్డీలు వసూలు చేసేవాడు అక్కడ వారు చెబుతుంటారు.ఆ తర్వాత సహారా గ్రూప్ లోకి మారాక కార్పొరేట్ లుక్ మొదలైందని అంటున్నారు. ఇక,, సహారా గ్రూప్ తో కొద్ది రోజులకే చెడిపోవటంతో.. ఆ గ్రూప్ మీద పగ పట్టేశాడు. రామరాజ్యం పేరుతో యూ ట్యూబ్ చానెల్ పెట్టి దందా మొదలు పెట్టాడు. మొదట్లో సహారా గ్రూప్ బాధితులతో వీడియోలు చేయించి బ్లాక్ మెయిల్ చేయసాగాడు….
మొదట్లో సహారా గ్రూప్ ను బ్లాక్ మెయిల్ చేసిన వీర రాఘవరెడ్డి అక్కడితో ఆగలేదు. సహారా గ్రూప్ ను శిక్షించటం లేదు కాబట్టి అధికారులను, ఆ తర్వాత కోర్టులను , చివరకు సుప్రీంకోర్టుని బ్లాక్ మెయిల్ చేస్తూ పోయాడు. యూ ట్యూబ్ ఛానెల్ లోనే కాకటం, బయట కూడా … సుప్రీంకోర్టును దూషిస్తూ వీడియోలు పెట్టేశాడు. ఈ క్రమంలో తప్పు చేస్తున్నావు అని చెప్పిన ప్రతీ ఒక్కరిని దూషించటం, వీడియోలు తయారు చేసి సోషల్ మీడియాలో సర్కులేట్ చేయటం మొదలు పెట్టాడు.
..
ఈ లోగా భగవద్గీత లోని కొన్ని శ్లోకాలు బట్టీ కొట్టి, వాటి సాయంతో గుడులు దగ్గరకు వెళ్లి అక్కడ పూజారులు, ధర్మకర్తల్ని బెదిరించటం మొదలెట్టాడు. వీడియో ఇంటర్వ్యూ అని చెప్పి వాళ్లను పప్పీ షేమ్ చేసేయటం, ఇలా చేయకూడదు అంటే తమ కోరికలు తీర్చాలని బ్లాక్ మెయిలింగ్ మొదలు పెట్టాడు. హిందూ మతంలోనే అంతర్గతంగా గొడవలు లేపాలన్నదే వీర రాఘవరెడ్డి గ్రూప్ టార్గెట్.
…
విశ్వసనీయ సమాచారం ప్రకారం,, వీర రాఘవరెడ్డి వెనుక అన్య మతాల మిషనరీలు పనిచేస్తున్నాయి అని తెలుస్తోంది. రాముడి పేరుతో రాడికల్ పద్దతుల్ని ప్రచారం చేయాలన్నది ఈ కుట్రలో భాగం. దీంతో పోలీసు అధికారుల మీద ఒత్తిడి పెరుగుతుంది. అటువంటప్పుడు ఇతర ప్రాంతాల్లో కూడా జై శ్రీరామ్ అనే ఇతర రామ భక్తుల మీద కూడా పోలీసులు ప్రతాపం చూపిస్తారు. చివరకు రాముడి పేరుని, రామ భక్తుల పేరును బద్నామ్ చేయాలన్నది ఈ అన్య మతాల కుట్ర.
….
శైవ, వైష్ణవాల మధ్య తగాదా పెట్టడం, ఆంధ్ర తెలంగాణ మధ్య గొడవ పెట్టడం, కులాలు వర్ణాలు మధ్య తగాదా పెట్టడం కూడా వీర రాఘవ రెడ్డి స్కెచ్ లో భాగం. గతంలో రాముడు ఆంధ్రుడు అని, తెలంగాణ వాళ్లంతా వచ్చి సేవలు చేయాలని వీడియోలు వదిలాడు. ఈ వీడియోల చాటున.. అన్య మతాల కుట్ర ను పూర్తిగా అమలు చేయటమే అతడి లక్ష్యం. అందుకోసమే కొత్త వేషాలు కట్టి, గ్యాంగ్ లను ఏర్పాటు చేసుకున్నాడు అని తెలుస్తోంది.
….
తాజాగా చిలుకూరు బాలాజీ గుడి అర్చకులు రంగరాజన్ మీద దాడితో ఈ బండారం బయట పడింది . మొదట్లో కొద్ది రోజుల పాటు రంగరాజన్ మీద సోషల్ మీడియా వేదిక గా మాటల దాడులు చేశారు. అయినా లొంగకపోవటంతో, ఇంటి మీద పడి భౌతిక దాడికి దిగేశారు. తీవ్రమైన పద్దతిలో బ్లాక్ మెయిల్ చేయాలని తీవ్రంగా ప్రయత్నాలు చేశారు కానీ,, ఈ దాడి పూర్తిగా వీడియో రికార్డింగ్ అవటంతో అసలు గుట్టు బయట పడింది.
…
మొత్తం మీద వీర రాఘవరెడ్డి ఎపిసోడ్ తో ఇతర మతాల కుట్ర ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. రాముడి పేరుతో రాక్షసపనులకు దిగుతున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.