అగ్నిపథ్ ను నిరసిస్తూ హన్మకొండ లో కాంగ్రెస్ చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారింది. పెద్దసంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యాలయంలోకి దూసుకెళ్లారు. పథకాన్ని రద్దుచేయలని నినాదాలు చేస్తూ ముందుకొస్తున్న
కాంగ్రెస్ నాయకుల వాహనాలపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు, వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఈ గొడవలో అనిల్ అనే ఒక పోలీసు తలకు బలమైన గాయమైంది. ఆయన్ని ఆస్పత్రికి తరలించారు.