దేశవ్యాప్తంగా ప్రభుత్వ వ్యవస్థలు పెట్టే ఖర్చులను తనిఖీ చేసే అత్యున్నత సంస్థ కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) చీఫ్గా తెలుగు ఐఏఎస్ అధికారి కె సంజయ్ మూర్తి బాధ్యతలు స్వీకరించారు. ఇది రాజ్యాంగబద్ధమైన పదవి. అందుచేత ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ చీఫ్ గా ఆయన ప్రమాణస్వీకారం చేశారు. ఆత్మీయ వాతావరణం లో జరిగిన ఈ కార్యక్రమంలో..
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించారు.
Shri K. Sanjay Murthy sworn in as the Comptroller and Auditor General of India, at Rashtrapati Bhavan. pic.twitter.com/GfM0DmloWS
— President of India (@rashtrapatibhvn) November 21, 2024
చిన్న వయసులోని ఐఏఎస్ కు ఎంపికైన మూర్తి చాలా కాలం ఉత్తరాది రాష్ట్రాల్లో పనిచేశారు. తర్వాత కేంద్ర సర్వీసులకు వచ్చి అనేక మంత్రిత్వ శాఖలకు నాయకత్వం వహించారు. ఆర్థిక వ్యవహారాల మీద గట్టిపట్టు ఉన్న అధికారిగా పేరు సంపాదించుకున్నారు.
తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో ఆయన పూర్వీకులు ఉండేవారు. ఆయన తండ్రి కె ఎస్ ఆర్ మూర్తి కూడా ఐఏఎస్ అధికారిగా సేవలు అందించారు. రిటైర్మెంట్ తర్వాత ఆయన అమలాపురం ఎంపీగా కూడా సేవలు అందించారు.
కాగ్ చీఫ్ గా మూర్తి ఎంపిక మీద అనేకమంది హర్షం వ్యక్తం చేశారు.