దేశాన్ని రెండుసార్లు పరిపాలిస్తున్న భారతీయ జనతా పార్టీ ఉత్తరాది రాష్ట్రాల్లో గట్టిపట్టు సంపాదించింది కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఒడిదుడుకుల మధ్య ప్రయాణం సాగుతోంది. ఈసారి ఎన్నికల్లో అయినా బలమైన సీట్లు సాధించి గట్టి పార్టీగా ఎదగాలని కమల నాధులు తలపోస్తున్నారు.
1980లో భారతీయ జనతా పార్టీ ఏర్పాటు అయిన తర్వాత చాలా వరకు సంఘ్ పరివార్ సంస్థల నుంచి నాయకులు, కార్యకర్తలు ఏర్పడ్డారు. అంతకుముందు జన సంఘ్ నుంచి కొనసాగుతున్న నాయకులకు ఈ కొత్త తరం తోడైంది . 1983 లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు రాష్ట్రమంతా ఎన్టీఆర్ ప్రభంజనం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. ఆ సమయంలో ఏపీలో ఉదయగిరి నుంచి వెంకయ్య నాయుడు, తెలంగాణలో శాయంపేట నుంచి చందుపట్ల జంగారెడ్డి, మలక్ పేటలో నల్లు ఇంద్రసేనారెడ్డి బిజెపి తరఫున గెలుపొందారు .ఆ తర్వాత ఏడాది పార్లమెంట్ ఎన్నికలు జరిగితే దేశమంతా ఇందిరాగాంధీ హత్యతో కాంగ్రెస్ కు సానుకూల పవనాలు వీచాయి. అప్పుడు పార్లమెంట్లో ఇద్దరు అంటే ఇద్దరే బిజెపి ఎంపీలు అడుగు పెట్టినప్పుడు.. హనుమకొండ నుంచి జంగారెడ్డి కాషాయ జెండా తో లోక్ సభకు చేరారు. 1985లో తెలంగాణలో బిజెపి సత్తా చాటుకోగా ఏపీలో మాత్రం చతికిల పడింది. అలంపూర్ నుంచి రవీంద్రనాథ్ రెడ్డి , హిమాయత్ నగర్ లో ఆలే నరేంద్ర, మలక్పేట్ లో మరోసారి ఇంద్రసేనారెడ్డి, కార్వాన్ లో బద్దం బాల్ రెడ్డి, రామాయంపేటలో శ్రీనివాస్ రెడ్డి, మెట్పల్లిలో విద్యాసాగర్ రావు, వర్ధన్నపేటలో శ్రీరాములు , పరకాల లో జైపాల్ గెలుపు సాధించారు. అప్పటి అసెంబ్లీలో చెప్పుకోదగ్గ స్థానాలతో పార్టీ ముందుకు నడిచింది. 1989లో అప్పటి పరిస్థితులు బట్టి బిజెపి ఐదు సీట్లకే పరిమితమైంది. అలంపూర్లో రవీంద్రనాథ్ రెడ్డి, కార్బన్ లో బద్దం బాల్రెడ్డి, మెట్ పల్లి లో విద్యాసాగర్ రావు, వర్ధన్నపేటలో రాజేశ్వరరావు, పరకాల లో జైపాల్ గెలుపు సాధించారు.
90వ దర్శనం నుంచి తెలుగుదేశం పార్టీతో కలిసి నడవడం ఎక్కువైంది. అటు కేంద్రంలో వాజ్ పేయి రాష్ట్రంలో చంద్రబాబుని కలుపుతూ మధ్యలో వెంకయ్య నాయుడు సమన్వయంతో బిజెపి ముందుకు సాగింది. 98 ఎన్నికల్లో కాకినాడ నుంచి కృష్ణంరాజు రాజమండ్రి నుంచి వెంకటస్వామి నాయుడు సికింద్రాబాద్ నుంచి బండారు దత్తాత్రేయ కరీంనగర్ నుంచి విద్యాసాగరం విజయ సాధించారు. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బిజెపి మెరుగైన ఫలితాలు సాధించింది విశాఖపట్నం నుంచి కంభంపాటి హరిబాబు, తూర్పుగోదావరి జిల్లా నగరం నుంచి అయ్యాజీ వేమ, విజయవాడ తూర్పు నుంచి కోట శ్రీనివాసరావు , కదిరి నుంచి ఎమ్మెస్ పార్థసారథి, అలంపూర్ నుంచి ఆర్ రవీంద్రనాథ్ రెడ్డి, ముషీరాబాద్ నుంచి డాక్టర్ లక్ష్మణ్ , మలక్ పేటలో నుంచి ఇంద్రసేనారెడ్డి, మహారాజ్ గంజ్ నుంచి ప్రేమ్ సింగ్ రాథోడ్, సంగారెడ్డి నుంచి కే సత్యనారాయణ, పెద్దపల్లి నుంచి గాజుల రామకృష్ణారెడ్డి, మెట్ పల్లి నుంచి తుమ్మల వెంకట రమణారెడ్డి, హనుమకొండ నుంచి ఎం ధర్మారావు గెలుపు సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టారు.
అటు పార్లమెంట్లో కూడా బిజెపి తెలుగు నేల నుంచి మంచి ప్రాతినిధ్యాన్ని సంపాదించింది సికింద్రాబాద్ నుంచి బండారు దత్తాత్రేయ, మహబూబ్ నగర్ నుంచి జితేందర్ రెడ్డి, మెదక్ నుంచి ఆలే నరేంద్ర, కరీంనగర్లో సిహెచ్ విద్యాసాగర్ రావు, తిరుపతిలో ఎన్ వెంకటేశం నరసాపురం నుంచి కృష్ణంరాజు రాజమండ్రి నుంచి సత్యనారాయణ, అనకాపల్లి నుంచి గంటా శ్రీనివాసరావు గెలుపు సాధించారు. ఇందులో ఇద్దరు ముగ్గురికి కేంద్రంలో మంత్రి పదవులు కూడా దక్కాయి. అదే సమయంలో మిత్ర పక్షం తెలుగుదేశానికి లోక్ సభ స్పీకర్ పదవిని బిజెపి అందించింది. అప్పటి ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో చంద్రబాబు హవా బాగా నడిచింది.
2004 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా బాగా సాగడంతో బిజెపికి నిరాశకర ఫలితాలు ఎదురయ్యాయి 2004లో హిమాయత్ నగర్ నుంచి కిషన్ రెడ్డి, పిఠాపురం నుంచి దొరబాబు ఎన్నికయ్యారు 2009లో నిజామాబాద్ నుంచి ఎండల లక్ష్మీనారాయణ అంబర్పేట్ నుంచి కిషన్ రెడ్డి ఎన్నికయ్యారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బిజెపికి బిక్కిరి అయ్యే పరిస్థితిలు ఏర్పడ్డాయి.
ఈలోగా 2014లో రాష్ట్ర విభజన జరగడం మరోసారి తెలుగుదేశంతో బిజెపి జతకట్టడం జరిగిపోయాయి. ఫలితంగా తెలంగాణ అసెంబ్లీలో జంట నగరాల నుంచి బిజెపికి గౌరవప్రదమైన స్థానాలు దక్కాయి సీనియర్ నేతలు కిషన్ రెడ్డి డాక్టర్ లక్ష్మణ్ చింతల రామచంద్రారెడ్డి రాజాసింగ్ ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు సికింద్రాబాద్ స్థానాన్ని దక్కించుకున్న బండారు దత్తాత్రేయ కేంద్రంలో మంత్రి పదవి సాధించారు అంటే ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి నుంచి ఆకుల సత్యనారాయణ తాడేపల్లిగూడెం నుంచి పైడికొండల మాణిక్యాలరావు కైకలూరు నుంచి కామినేని శ్రీనివాస్ విశాఖపట్నం ఉత్తర నుంచి విష్ణుకుమార్ రాజు అసెంబ్లీలోకి అడుగుపెట్టారు పొత్తు ధర్మంలో భాగంగా కొంతకాలం పాటు కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు మంత్రులుగా వ్యవహరించారు. ఈ సమయంలో రెండు ప్రాంతాల్లోనూ పార్టీని పటిష్టపరిచేందుకు క్యాడర్ ను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటారని భావించినప్పటికీ నిరాశే ఎదురైంది. దీంతో 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో బిజెపి డక్ ఔట్ కాగా తెలంగాణలో 2018 కి రాజాసింగ్ ఒక్కరే అసెంబ్లీలో అడుగు పెట్టారు. తర్వాత కాలంలో రఘునందన్ రావు ఈటల రాజేందర్ ఆయనకు తోడయ్యారు మరోవైపు 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి నరేంద్ర మోడీ పరువు దక్కించుకొంది. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి కరీంనగర్ నుంచి బండి సంజయ్ నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ ఆదిలాబాద్ నుంచి సోయం బాపూరావు ఎన్నికయ్యారు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బలమైన సీట్లు సాటిస్తారని భావించినప్పటికీ 8 సీట్లు దక్కించుకోవడం జరిగింది. అందులో ఎక్కువగా ఆదిలాబాద్ నిజామాబాద్ ప్రాంతానివి కావడం విశేషం. ఈ సమయంలో మరోసారి ఎన్నికల ముంచుకొస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేనతో బిజెపి పొత్తు కట్టింది అక్కడ బలమైన సీట్లు దక్కుతాయని కమల నాధులు అంచనా వేస్తున్నారు. ఇటు తెలంగాణలో మోడీ ప్రభావం తోడుగా బీఆర్ఎస్ నీరసపడడం వంటి అంశాలు కలిసి వస్తున్నాయి . మొత్తం మీద ఈ ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో బలమైన సీట్లు సాధించి భారతీయ జనతా పార్టీ బలపడాలని పార్టీ అభిమానులు కోరుకుంటున్నారు.