పొనియన్ సెల్వన్ సినిమా గుర్తుంది కదా తమిళంలో తయారుచేసిన తెలుగు సహా అన్ని దక్షిణాది భాషల్లోనూ రిలీజ్ చేశారు. ఇటు కమర్షియల్ గాను, అటు సినిమా నిర్మాణ విలువలు పరంగాను చాలా పేరు తెచ్చుకుంది ఈ సినిమాలో నటించి అలరించిన శోభిత ధూళిపాల ఇప్పుడు మరో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నది.
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో అందాలు చిందిస్తూ సందడి చేస్తోంది.
కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో టాప్ స్థాయి సినీ ప్రముఖులకే అవకాశం ఉంటుంది. ఈ వేడుకలో తొలిసారి తెలుగు నటి శోభిత దూళిపాళ కూడా భాగమైంది. శోభిత నమ్రత జోషిపూర్ జంప్ సూట్ లో రెడ్ కార్పెట్ పై వాక్ చేసింది. అత్యుత్తమ ఎంపికలో శోభిత తళుక్కున మెరిసింది.
శోభిత పదహారణాల తెలుగమ్మాయి. తెనాలికి చెందిన నేవీ అధికారి ఇంట్లో పుట్టింది విశాఖపట్నంలోనే గడిచింది. ముంబైలో చదువుతుండగా.. సినీ పరిశ్రమ లో అడుగుపెట్టింది.
అప్పట్లోనే మిస్ ఇండియా ఎర్త్ కిరీటం దక్కించుకొని సంచలనం కలిగించింది. ఇప్పుడు కేన్స్ వేదిక మీద కూడా కలర్‌ఫుల్ డ్రస్సుతో కళకళ లాడుతోంది
మిరుమిట్లు గొలిపే పర్పుల్ కార్డెలియా జంప్‌సూట్‌లో అద్భుతమైన రూపాన్ని పొందింది. ఔట్ఫిట్, స్లీవ్‌లెస్ పీస్, రిచ్, డీప్ పర్పుల్ షేడ్‌లో డిజైనర్ లో ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. మ్యాకప్, యాక్సరసీస్ ప్రతీది ఆమె లో బ్యూటీని అంతకంతకు రెట్టింపు చేసింది.
ముఖ్యంగా శోభిత రింగు రింగు జుత్తు కేన్స్ లో స్పెషల్ గా హైలైట్ అవుతున్నాయి .
అందం ఆకర్షణతో కేన్స్ ఫెస్టివల్ లో శోభిత ధూళిపాల ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. దక్షిణార్థులు అన్ని భాషల్లోనూ నటించిన శోభిత ప్రస్తుతం వెబ్ సిరీస్ మీద ఎక్కువగా దృష్టి పెట్టారు.
హిందీ సహా అనేక భాషలో వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు.