తెలంగాణకు చెందిన విద్యార్థి కెనడాలో ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ జిల్లాలోని డిండి మండలం ఆకుతోటపల్లికి చెందిన ప్రవీణ్ రావు… ఉన్నత చదువుల కోసం ఆరేళ్ల క్రితం కెనడా వెళ్లాడు. ఏమైందో తెలీదు ఉదయం తానుంటున్న భవనంపైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రవీణ్ తండ్రి సాధారణ రైతు. యువకుడి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. అయితే ప్రవీణ్ ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.