తెలంగాణ వ్యాప్తంగా సంక్రాంతి పండుగను ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. అనేకచోట్ల మహిళలు ముగ్గులు వేస్తూ .. పండగ స్ఫూర్తిని తెలియజేస్తున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ ఆడపడుచులు వెరైటీ ముగ్గులకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని నిరసన తెలియజేశారు. సంక్రాంతి ముగ్గులనే తమ నిరసనకు వేదికగా ఉపయోగించారు. 6 గ్యారంటీలను గాలికి వదిలేసారు అని తెలియచెపుతూ,, నిరసన స్లోగన్ లతో కూడిన ముగ్గులను వేశారు.
ఈ సందర్భంగా మాజీ మండలాధ్యక్షుడు తుల శ్రీనివాస్ మాట్లాడుతూ .. ఈ ప్రభుత్వంతో అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయారు అని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలకు ఇచ్చిన హామీలను పూర్తిగా గాలికి వదిలేసారు అని విమర్శించారు. అందుచేతనే ముగ్గుల ద్వారా ఆడపడుచులు నిరసన తెలియజేశారు అని పేర్కొన్నారు.
ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అఖిల్ , హరీష్ , నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
More Photos :