టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారన్న వ్యవహారం కలకలం రేపుతోంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం పెద్దమొత్తంలో డబ్బు, కాంట్రాక్టులు, పదవులు ఇస్తామని బీజేపీవాళ్లు తమను ప్రలోభపెడ్తున్నారని… తమకు నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రోహిత్ రెడ్డి, హర్షవర్దన్ రెడ్డి, రేగా కాంతారావు, గువ్వలబాలరాజు సమాచారం ఇచ్చారు.మెయినాబాద్ సమీపంలోని ఆజీజ్ నగర్‌లోని ఫాంహౌజ్ లో తమతో పాటు తమను ప్రలోభపెట్టేందుకు వచ్చిన ముగ్గురు వ్యక్తులున్నాయని చెప్పడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వాళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఫాంహౌజ్‌లో ఢిల్లీ ఫరీదాబాద్ కు చెందిన రామచంద్రభారతి, తిరుపతికి చెందిన సింహయాజులు, హైదరాబాద్ కు చెందిన నందకుమార్ ఉన్నారని పోలీసులు తెలిపారు.
అయితే అక్కడున్న వాహనంలోని బ్యాగుల్లో డబ్బు ఉందని ప్రచారం జరిగింది.అయితే అందులో ఎంతమొత్తం ఉంది అనేది ఇంకా పోలీసులు బయటపెట్టలేదు. అటు నలుగురు ఎమ్మెల్యేల్లో ఒకరైన పైలట్ రోహిత్ రెడ్డి ఫిర్యాదు మేరకు.. పోలీసులు కేసు నమోదు చేశారు. బీజేపీలో జాయిన్ అయితే రూ.100 కోట్లు ఇప్పుస్తామని సతీష్ శర్మ అలియాస్ రామచంద్ర భారతి ఆఫర్ చేశారు. నందు మధ్య వర్తిత్వంతో సతీష్ శర్మ, సింహయాజులు ఫామ్ హౌస్‌కి వచ్చారు. టీఆర్ఎస్కి రాజీనామా చేసి వచ్చే ఎన్నికల్లో బీజేపీలో జాయిన్ అయితే 100 కోట్లు ఇస్తామని బీజేపీ నుంచి హామీ ఇచ్చారు. బీజేపీలో చేరితే ఈడీ, సీబీఐ కేసులు నమోదు కాకుండా చూడటంతో పాటు క్రిమినల్ కేసులు లేకుండా చేస్తామన్నారు. సెంట్రల్ సివిల్ కాంట్రాక్టులతో పాటు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నత పదవులు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు అని రోహిత్ రెడ్డి చెప్పినట్టు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆఫర్ చేసిన 100 కోట్లల్లో 50 కోట్లు ముందుగా అడ్వాన్స్ రూపంలో ఇస్తామని హామీ ఇచ్చారు. రోహిత్ రెడ్డితో పాటు జాయిన్ అయిన ప్రతి ఎమ్మెల్యేకు 100 కోట్లు ఇస్తామన్నారని రోహిత్ ఫిర్యాదు చేశారు.
ఈ వ్యవహారంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. బీజేపీకి చెందిన వాళ్లుగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్పిన సింహయాజులు, నందకుమార్,రామచంద్రభారతిని మొయినా బాద్ ఫాంహౌజ్ నుంచి రహస్య ప్రాంతానికి తరలించినట్టు తెలిసింది. వారి సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు.వివరాలు తీసుకుని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. అటు వ్యవహారం నడిచిన ఫాంహౌజ్ ను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎవరినీ ఆ పరిసరాలకు రానివ్వడం లేదు.
https://twitter.com/KP_Aashish/status/1585300884908478465?s=20&t=XDW1rlcGO21VQvCtqAfivg