పోలీసు విభాగం చేస్తున్న పనులు బాధ్యతల గురించి సమాజంలో అవగాహన కల్పించేందుకు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా పోలీసులు ఏఏ అంశాల మీద ఎలా స్పందిస్తారు, పోలీసులను సంప్రదించడం ఎలా, పోలీసు శాఖ వనరులు సంపత్తి గురించి అవగాహన కల్పిస్తూ ఉంటారు. తాజాగా ఆనన్లో కూడా వివిధ వర్గాల ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని పోలీసు శాఖ నిర్వహిస్తోంది.
అదిలాబాద్ జిల్లా పోలీసులు ఆధ్వర్యములో ఓపెన్ హౌస్ కార్యక్రమం ఆన్లైన్ లో ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో పోలీసులు విధులు ,వినియోగించే ఆయుధాలు,పరికరాలు, డాగ్ స్క్వాడ్ విధులు పై అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని బోథ్ మండలంలోని సోనాల గ్రామములోని వివేకానంద పాఠశాల విద్యార్థులు వీక్షించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్,అధ్యాపక బృందం, పాల్గొన్నారు..