కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వాన్ని, బిజెపిని బద్ నాం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బలమైన షాక్ తగిలింది. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహాయం చేయడం లేదంటూ రేవంత్ అండ్ టీం.. తీవ్రంగా బ్లేమ్ గేమ్ నడిపిస్తున్నారు. దీనిని బలపరిచేందుకు అప్పుడప్పుడు కేంద్రానికి వినతి పత్రాలు అందిస్తున్నారు. కానీ ఈసారి ఈ ట్రిక్ ఫలించలేదు సరి కదా రివర్స్ గేర్ పడింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మెట్రోరైల్ రెండో దశ, ట్రిపుల్ఆర్ దక్షిణభాగం మంజూరు, మూసీ పునరుజ్జీవనానికి రూ. 20 వేల కోట్ల నిధులు, సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు తదితర అంశాలపై మోదీకి వినతిపత్రం అందజేశారు. వీటిన్నింటిని కొద్దిసేపు నిశితంగా పరిశీలించిన ప్రధాని .. రేవంత్‌రెడ్డి మాటలు కూడా ఆలకించారు. ఆ తర్వాత తన టేబుల్‌పై ఉన్న ఓ పేపర్‌ను తీసి సీఎం రేవంత్‌రెడ్డికి ఇచ్చారట. వాటిని చూసి అవాక్కవడం రేవంత్‌రెడ్డి వంతయిందట. కేంద్ర, రాష్ర్టాల వాటాతో చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం, భూసేకరణ, అనుమతులు పెండింగ్‌లో ఉన్నటువంటి అంశాలను మోదీ ప్రస్తావించారు. కేంద్రం వద్ద గల సమస్యలను పరిష్కరించాలని కోరడానికి ముందు మీ వద్ద పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని స్పష్టంగా సూచించినట్టు తెలిసింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డికి నోట మాట రాలేదు అని తెలుస్తోంది.
ప్రధానికి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన ఒక ముఖ్యమంత్రికి ప్రధానమంత్రి రివర్స్ నోట్ ఇవ్వడం చాలా అరుదు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పీఎంను కలిసేందుకు సీఎం వెళ్లినప్పుడు లేదా రాష్ర్టానికి ప్రధానమంత్రి వచ్చినప్పుడు సదరు సీఎంలకు అనుమతుల మంజూరు పత్రాలు, లేదా నిధుల విడుదల పత్రాలను అందిస్తుంటారు.
కానీ, ఇక్కడ కేంద్రం తరుపున తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఒక సీఎంను ప్రధాని నేరుగా కోరడం, ఏకంగా నోట్ ఇవ్వడం సంచలనంగా మారింది.
కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వాన్ని బద్ నాం చేసేందుకు ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులు ఆడుతున్న నాటకాన్ని గమనించిన ప్రధాని మోదీ.. ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ప్రజలకు స్పష్టంగా విషయాలు తెలిసేలా ఆయన వ్యవహరించారు. దీంతో కేంద్రాన్ని ఏమీ అనలేని సీఎం రేవంత్ రెడ్డి … బిజెపి నాయకులు చొరవ తీసుకొని పెండింగ్ ప్రాజెక్టులు క్లియర్ చేయించాలి అని కొత్త వాదన మొదలుపెట్టారు.