11 మంది బ్యూరోక్రాట్ల క్యాడర్‌పై తెలంగాణ హై కోర్టులో విచారణ జరిగింది.అడిషనల్ సొలిసిటర్ జనరల్ లేని కారణంగా విచారణ వాయిదా వేయాలని కేంద్రం తరుపు న్యాయవాది కోరడంతో కోర్టు తదుపరి విచారణను ఈనెల 27కి వాయిదా వేసింది. విచారణ సందర్భంగా పికే మహంతి , అభిషేక్ మహంతి హాజరయ్యారు. రాష్ట్ర విభజన తరువాత ఐఏఎస్ , ఐపీఎస్ లను ఏపీ , తెలంగాణ కు కేటాయించారు. దాదాపు 11 మంది అధికారులకు ఒక క్యాడర్ కేటాయిస్తే వేరొక రాష్ట్రంలో పనిచేస్తుండడంతో దీనిపై గతంలో క్యాట్‌లో విచారణ జరిగింది. అయితే కేంద్రం ఇచ్చిన మార్గదర్శకలు సరిగా లేవని కొట్టివేస్తూ 11 మంది ఐఏఎస్, ఐపీఎస్‌లకు ఇచ్చిన రాష్ట్రం కాకుండా మరొక రాష్ట్రంలో కొనసాగేలా ఆదేశాలిచ్చింది. దీంతో క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులను కేంద్రం సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై 2017 నుంచి వాదనలు సుదీర్ఘంగా కొనసాగాయి. దీనిపై ఈరోజు కూడా వాదనలు జరిగాయి. అయితే కేంద్రం తరఫున వాదనలు వినిపించడానికి అడిషనల్ సొలిసిటర్ జనరల్ రాకపోవడంతో తదుపరి విచారణ ఈ నెల 27కు వాయిదా వేసింది.