ప్రపంచ క్రికెట్లో తెలంగాణ యువకిశోరం గొంగటి త్రిష సత్తా చాటింది. త్రిష ది మన తెలంగాణ గడ్డమీద భద్రాచలం స్వగ్రామం. అద్భుతమైన రికార్డు సాధించి అభిమానుల ప్రశంసలు అందుకుంది.
అటు బౌలింగ్ లోను ఇటు బ్యాటింగ్ లోను త్రిష రాణించారు. స్కాట్లాండ్ తో జరిగిన సూపర్ సిక్స్ మ్యాచ్‌లో కేవలం 53 బంతుల్లోనే అజేయ సెంచరీ సాధించి రికార్డును నెలకొల్పింది. వుమెన్స్ అండర్-19 ప్రపంచ కప్‌లో సెంచరీ సాధించిన తొలి వుమెన్స్ క్రికెటర్‌గా నిలిచింది. అదే సమయంలో బంతితోనూ రాణించి మూడు వికెట్లు పడగొట్టింది.
ఈ సంవత్సరం అండర్-19 వరల్డ్ కప్ సూపర్ సిక్స్ మ్యాచ్‌లో స్కాట్లాండ్తో టీమిండియా తలపడింది. స్కాట్లాండ్ టాస్ గెలిచి ఫీల్డ్ ఎంచుకుంది. ఓపెనర్లు కమలిని, గొంగడి త్రిష చెలరేగి ఆడారు .ఓపెనర్లు ఇద్దరు కలిసి ప్రపంచ కప్‌లో అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తొలి వికెట్‌కు ఇద్దరు అజేయంగా 147 పరుగులు జోడించారు. మ్యాచ్‌లో ముఖ్యంగా తెలంగాణ అమ్మాయి త్రిష 59 బంతుల్లోనే 110 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. 13 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో స్కాట్లాండ్ బౌలర్లపై విరుచుకుపడింది. కమిలిని 42 బంతుల్లో 51 పరుగులు చేయగా.. మరో బ్యాట్స్ వుమెన్ సానికా చల్కే 20 బంతుల్లో 29 పరుగులు చేసింది. ముగ్గురు చెలరేగడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్ చేసింది.
మొత్తానికి త్రిష క్రికెట్ మైదానంలో చెలరేగింది. త్రిష సాధించిన రికార్డు పట్ల స్వగ్రామం భద్రాచలంలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.