తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేశారు. గతంలో ప్రకటించిన మే 7నుంచి 14 వరకు కాకుండా మే 12 నుంచి పరీక్షలుంటాయి. మే 12 నుంచి 14 వరకు తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి తెలిపింది. మే 10, 11 తేదీన అగ్రికల్చర్ ఫార్మసీ పరీక్ష జరగనుంది. అయితే ఆయా తేదీల్లో నీట్, టీఎస్పీఎస్సీ పరీక్ష తేదీలు ఉండటంతో ఎంసెట్ పరీక్ష తేదీలను మార్పు చేసినట్లు విద్యామండలి వెల్లడించింది.