తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజయవంతంగా ప్రజల దృష్టిని మళ్లించగలిగారు. KTR కేసు విచారణ అంటూ రెండు రోజుల పాటు హడావుడి చేయించారు. దీంతో KTR ను అరెస్టు చేస్తారా లేదా అన్న విషయం హాట్ టాపిక్ గా మారిపోయింది. దీంతో రెండు రోజులుగా తెలంగాణ సమాజం అంతా … ఇదే విషయం మాట్లాడుకొనేట్లుగా చేయగలిగారు.
..
ఇక్కడే అసలు గమ్మతు దాగి ఉంది. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను నరేంద్రమోదీ ప్రభుత్వం సాకారం చేసింది. పసుపు బోర్డుని నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేసింది. సంక్రాంతి పండగ వేళ వర్చువల్ విధానంలో దీనిని ప్రారంభించారు. దాదాపు 37 సంవత్సరాల తర్వాత కేంద్రం నుంచి ఒక బోర్డు ఏర్పాటు జరిగింది. దీంతో తెలంగాణ రైతులకు చాలా చాలా ప్రయోజనం దక్కుతుంది
…
నిజానికి తెలంగాణ బీజేపీ కి ఇది పెద్ద గెలుపు కింద లెక్క. కానీ ఇక్కడే రేవంత్ ప్లాన్ వర్కవుట్ అయింది. కేటీయార్ ను విచారణ పేరుతో ఏసీబీ కార్యాలయం లో కూర్చోబెట్టించి హడావుడి చేయించారు. దీంతో రాష్ట్ర ప్రజల దృష్టి పూర్తిగా ఇటువైపు మళ్లింది. కేటీయార్ అరెస్టు తప్పదు అంటూ మీడియాకు లీకులు ఇప్పించారు. దీంతో రెగ్యులర్ మీడియా, సోషల్ మీడియాల్లో హడావుడి మరింత పెరిగింది.
…
ఈ హడావుడి మధ్య మోదీ ప్రభుత్వం .. పసుపు బోర్డు ఇచ్చింది అన్న మాట మరుగున పడిపోయింది. ఈ విషయం పట్టించుకొనే వారే లేక పోయారు. అటు బీజేపీ నాయకులు కూడా ఈ ట్రాప్ లో ఇరుక్కొని పోయారు. దీంతో పసుపు బోర్డు క్రెడిట్ బీజేపీ కి అందకుండా పోయింది. నామ్ కే వాస్తీ గా ఈ విషయాన్ని తెలంగాణ సమాజం తేల్చేసింది.