తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాత గేమ్ ను కొత్తగా ఆడుతోంది. రైతుల్ని నిండా ముంచేసేందుకు భూభారతి చట్టాన్ని ఉపయోగించు కుంటున్నారు. అనుభవ దారు అనే కాలంలో మళ్ళీ చేర్చడం ద్వారా రైతుల గుండెల్లో రాయి పడింది.
ముఖ్యంగా నిరక్ష్యరాస్యులైన రైతులకు ఇది శాపంగా మారుతోంది.
గతంలో కూడా ఈ కిరికిరి ద్వారా వేలాది రైతుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇందులో భాగంగా… ముందుగా రెవెన్యూ రికార్డుల్లో అనుభవదారు కాలమ్లో అక్రమార్కులు.. తమ పేరు రాయించుకునేవారు. ఈ విషయం రైతులకు కూడా తెలిసేది కాదు. కొన్నేండ్లు అనుభవదారుగా కొనసాగిన తర్వాత పేరును పట్టాదారు కాలమ్లోకి మార్చి.. అసలు రైతు పేరును తొలిగించేవారు. ఈ విషయం కూడా రైతులకు తెలిసేది కాదు. రైతు అవసరానికి భూమిని అమ్మాలని భావించినప్పుడు ఈ విషయం బయటపడేది. దీంతో రైతులు తమ భూమిని ఇప్పించాలంటూ రెవెన్యూ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చేది. కోర్టులకు వెళ్లినా పెద్దగా ప్రయోజనం ఉండేది కాదు. ఏండ్లపాటు రికార్డుల్లో అసలు రైతు స్థానంలో అక్రమార్కుల పేర్లే కనిపించడంతో సాంకేతికంగా అక్రమార్కులే పైచేయిగా నిలిచేవారు.
దీంతో మరో రకం మోసాలు కూడా ఉన్నాయి.
ఈ స్కెచ్ తో రైతులకే కాదు ప్రభుత్వ భూములు, దేవుడి మాన్యాలు సైతం ఆక్రమణలకు గురయ్యాయి. ఆలయాల్లో పనిచేసినవారు, ధర్మకర్తల వంటివారు ఆలయాల మాన్యాల భూముల్లో అనుభవదారుగా చేరి, కొన్నేండ్ల తర్వాత పట్టాదారుగా రికార్డుల్లో మార్పించు కునేవారు. ఇలా వేలాది ఎకరాల భూములు అన్యాక్రాంతం అయ్యాయి.
రైతులు బాధను అర్థం చేసుకోవాలి అని గ్రామీణ ప్రజలు కోరుతున్నారు. ఈ అనుభవదారు కాలంలో తొలగించాలి అని డిమాండ్ చేస్తున్నారు.