“ది కశ్మీర్ ఫైల్స్” చిత్రం థియేటర్లలో విడుదలై దుమారం లేపుతోంది. ఈ చిత్రానికి పలు రాష్ట్రాలు పన్ను రాయితీని ప్రకటించాయి. గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్ సహా కర్ణాటక రాష్ట్రాల్లో పన్ను రద్దు చేశారు. ఇదిలా ఉండగా మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే నితీష్ రాణే కాశ్మీర్ ఫైల్స్ చిత్రానికి ఎంటర్టైన్మెంట్ పన్ను రాయితీ చేయమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు లేఖ రాశారు.
“జాతీయాసక్తి కలిగిన చిత్రాలకు జీఎస్టీ మాఫీ అవుతోంది, మళ్ళీ రాష్ట్రాలను పన్ను రద్దు చేయాలని చిత్ర నిర్మాతలు ఎందుకు కోరుతున్నారో నాకర్థమవ్వట్లేదు.. రాజకీయ లబ్ది కోసమా? అని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది చేసిన వ్యాఖ్యలు వివాదం రేపుతున్నాయి.
సినిమా ప్రజా ప్రయోజనం కోసం తీసినట్లైతే నిర్మాతలు జనాల బాధను సొమ్ము చేసుకోవటం కంటే ఉచిత స్ట్రీమింగ్‌ను పరిగణించకూడదా?” అంటూ ట్వీట్ చేశారు. ఈ విధమైన వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్త పరుస్తున్నారు.
కాశ్మీర్ పండిట్ల మారణహోమం అక్కడి వాళ్లకు, ఆ సమయంలో జీవించి ఉన్న ప్రజలకు తప్పించి దేశ ప్రజలకు తెలియదు, కానీ ఈ చిత్రం ద్వారా అప్పటి పరిస్థితులు కళ్ళకు కట్టినట్టు తీయడం వల్ల విపరీతంగా జనాదరణ పొందుతోంది.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)