‘ది కేరళ స్టోరీ’ సినిమాకు పన్ను మినహాయింపు ఇస్తున్నట్టు ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ప్రకటించారు.
అయితే మూవీ ట్రైలర్ రిలీజ్ అయినదగ్గర్నుంచీ వివాదాలు రేగుతున్నాయి. తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్లో అయితే ప్రభుత్వాలు సినిమాను బ్యాన్ చేశాయి. అయితే మిగతా చోట్ల విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. తాజాగా పెద్దరాష్ట్రం యూపీలో కేరళ స్టోరీకి టాక్స్ ఫ్రీ చేస్తున్నట్టు యోగీ ఆదిత్యనాథ్ తెలిపారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదిగ్గా కూడా వెల్లడించారు. కేబినెట్ మంత్రులు వారివారి కుటుంబసభ్యులతో సినిమా చూస్తామని ప్రకటించారు.
ఇంతకుముందే విడుదలైన మరునాడే అంటే మే 6న మూవీకి పన్ను మినహాయింపు ఇచ్చింది మధ్యప్రదేశ్. అందులో ప్రధాన పాత్ర పోషించిన ఆదాశర్మ సొంత రాష్ట్రం ఉత్తరాఖండ్‌లోని బీజేపీ ప్రభుత్వం కూడా చిత్రానికి పన్నుమినహాయింపు ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ డెహ్రాడూన్‌లోని పీవీఆర్ హాలులో సినిమా చూశారు.
సినిమా విడుదలపై స్టే విధించేందుకు కేరళ హైకోర్టు నిరాకరించింది. ట్రైలర్లో ఏ ఒక్క వర్గానికి అభ్యంతరకరమైన అంశాలు లేవంది. తమిళనాడులోని మల్టీప్లెక్స్ థియేటర్లు ఆ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని పేర్కొంటూ మే 7వతేదీ నుంచి కేరళ స్టోరీ ప్రదర్శనను నిలిపేసిన సంగతి తెలిసిందే.
'The Kerala Story' उत्तर प्रदेश में टैक्स फ्री की जाएगी।
— Yogi Adityanath (@myogiadityanath) May 9, 2023