ఎయిరిండియా తిరిగి టాటా గ్రూప్ చేతికి అందిన నేపథ్యంలో టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ప్రధాని మోదీతో సమావేశమయ్యారు.. దానికి సంబంధించిన ఫొటోను పీఎంవో ట్వీట్ చేసింది. ఎయిరిండియా అప్పగింత ప్రక్రియ పూర్తైనందుకు సంతోషంగా ఉందని చంద్రశేఖరన్ అన్నారు. అటు అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిరిండియా కార్యకలాపాలు కొనసాగేలా టాటా సన్స్ కు రుణాలిచ్చేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని కన్సార్టియం అంగీకరించింది.