అప్పుల ఊబిలో ఉన్న ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను తిరిగి టాటానే చేజిక్కించుకుంది. ఎయిరిండియా ప్రైవేటీకరణపై ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఎయిరిండియాను దక్కించుకునేందుకు పలు ప్రముఖ సంస్థలు పోటీపడుతూ బిడ్లు వేశాయని…అయితే 18 వేల కోట్లకు టాటాలు సొంతం చేసుకున్నాయని కేంద్రప్రభుత్వ పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం…డీఐపీఏఐం స్పష్టం చేసింది.
చాలా సంస్థలు ఎయిరిండియాను దక్కించుకునేందుకు పోటీ పడ్డాయి. రూ. 15 వేల కోట్లకు కొంటామంటూ స్పూస్జెట్ బిడ్ దాఖలు చేసింది. టాటాలు రూ. 18 వేల కోట్లతో బిడ్ దాఖలు చేశారు. సెప్టెంబరులో ఈ బిడ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఒప్పందం మేరకు ఎయిరిండియా డిసెంబర్ నాటికి టాటా గ్రూప్ చేతికి వెళ్తుంది.