ప్రాణాంతక కరోనా విజృంభిస్తున్న వేళ దేశవ్యాప్తంగా ఆక్సిజన్ సరఫరా సాఫీగా జరిగేలా పర్యవేక్షించేందుకు ఏకంగా సుప్రీంకోర్టు రంగంలోకి దిగింది. జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ 12 మంది సభ్యులతో నేషనల్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా మెడికల్ ఆక్సిజన్ అవసరాన్నిగుర్తించి సిఫారసు చేయడం, పంపిణీబాధ్యత చూసుకోవడం వంటివి ఈ కమిటీ చూస్తుంది.
సుప్రీంకోర్టు నియమించిన నేషనల్ టాస్క్‌ఫోర్స్‌లో 10 మంది వైద్యులున్నారు. కేంద్ర కేబినెట్ సెక్రటరీ ఈ కమిటీకి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి కూడా దీనిలో ఓ సభ్యునిగా వ్యవహరిస్తారు.
ఈ టాస్క్‌ఫోర్స్ సభ్యుల వివరాలు :
1. డాక్టర్ భబతోష్ బిశ్వాస్, కోల్‌కతాలోని పశ్చిమ బెంగాల్ హెల్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్
2. డాక్టర్ దేవేందర్ సింగ్ రాణా, ఢిల్లీలోని సర్ గంగారామ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ బోర్డ్ చైర్పర్సన్
3. డాక్టర్ దేవీ ప్రసాద్ షెట్టి, బెంగళూరులోని నారాయణ హెల్త్‌కేర్ చైర్పర్సన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
4. డాక్టర్ గగన్‌దీప్ కాంగ్, తమిళనాడులోని వెల్లూరులో ఉన్న క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్
5. డాక్టర్ జేవీ పీటర్, తమిళనాడులోని వెల్లూరులో ఉన్న క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ డైరెక్టర్
6. డాక్టర్ నరేశ్ ట్రెహాన్, గురుగ్రామ్‌లోని మేదాంత హాస్పిటల్ అండ్ హార్ట్ ఇన్స్టిట్యూట్ చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్
7. డాక్టర్ రాహుల్ పండిట్, మహారాష్ట్రలోని ముంబై, కల్యాణ్‌లోని క్రిటికల్ కేర్ మెడిసిన్ అండ్ ఐసీయూ, ఫోర్టిస్ హాస్పిటల్ డైరెక్టర్
8. డాక్టర్ సౌమిత్ర రావత్, ఢిల్లీలోని సర్ గంగారామ్ హాస్పిటల్, సర్జికల్ గాస్ట్రోఎంటరాలజీ అండ్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ డిపార్ట్మెంట్ చైర్మన్, హెడ్
9. డాక్టర్ శివ కుమార్ సరిన్, ఢిల్లీలోని లివర్ అండ్ బిలియరీ సైన్స్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్, హెపటాలజీ డిపార్ట్మెంట్ హెడ్, సీనియర్ ప్రొఫెసర్
10. డాక్టర్ జరీర్ ఎఫ్ ఉద్వదియా, ముంబైలోని హిందూజా హాస్పిటల్, బ్రీచ్ కాండీ హాస్పిటల్, పార్సీ జనరల్ హాస్పిటల్ కన్సల్టెంట్ ఛెస్ట్ ఫిజిషియన్
11. భారత ప్రభుత్వ ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి (ఎక్స్ అపిషియో సభ్యుడు)
12. నేషనల్ టాస్క్‌ఫోర్స్ కన్వీనర్‌గా కేంద్ర ప్రభుత్వ కేబినెట్ సెక్రటరీ వ్యవహరిస్తారు.