నందమూరి తారకరత్న అంత్యక్రియలు ముగిశాయి.తారకరత్న చితికి ఆయన తండ్రి మోహన కృష్ణ నిప్పుపెట్టారు. నందమూరి కుటుంబసభ్యులు భారమైన హృదయంతో తారకరత్నకు అంతిమ వీడ్కోలు పలికారు. అంతకుముందు ఆయన భౌతిక కాయాన్ని ఫిలించాంబర్ కు తరలించారు.అక్కడినుంచి మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర సాగింది. పెద్దసంఖ్యలో ఆయన అభిమానులు తరలివచ్చి కన్నీడివీడ్కోలు పలికారు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్, పురంధేశ్వరి అంతిమయాత్రలో కూడా ఉన్నారు. ఇక తారకరత్న చనిపోయినదగ్గర్నుంచీ అంతిమ కార్యక్రమాలు పూర్తయ్యేవరకు వైసీపీ నేత విజయసాయిరెడ్డి, బాలకృష్ణ దగ్గరుండి అన్నీ తామై చూసుకున్నారు.
https://twitter.com/TEAM_CBN1/status/1627629217298137089?s=20