తెలంగాణలో ఉపాధ్యాయుల సమస్యల మీద పోరాడుతున్న నికరమైన అసోసియేషన్ గా తపస్ ను చెప్పవచ్చు. తెలంగాణ ఏర్పాటు అయినట్లు నుంచి అన్ని ఉమ్మడి జిల్లాల్లో కార్యవర్గాలను ఏర్పాటు చేసుకుంటూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో తపస్
ఉమ్మడి బోథ్ మండలం కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా నవ్వ వెంకటరమణ , ప్రధాన కార్యదర్శిగా సెర్పూర్ శ్రీనివాస్ , సహా అధ్యక్షులుగా ఈర్ల దీపక్ , ఆర్థిక కార్యదర్శిగా రాథోడ్ మనోజ్ ,కార్యదర్శులుగా జాదవ్ సకారం , అశోక్ ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా తపస్ అదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు సునీల్ చవాన్ మాట్లాడుతూ, ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం కృషి చేస్తుందని అన్నారు. ఈ నెలలో జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో తపస్ బలపరిచిన మల్క కొమరయ్య ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఈ సమావేశంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సునీల్ చవాన్ , వలబోజు గోపికృష్ణ ,జిల్లా ఉపాధ్యక్షులు విట్టల్ రావు తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయ సోదరులు కార్యక్రమాలలో పాల్గొన్నారు.