అద్భుత పనితీరుతో టీహబ్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. స్టార్టప్ సంస్థలకు టీహబ్ చిరునామాగా మారిందన్నారు. డల్లాస్ వెంచర్ క్యాపిటల్ తో టీహబ్ ఒప్పందం చేసుకున్న సందర్భంగా కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఇండియా ఫండ్ పేరుతో టీ హబ్ కి డల్లాస్ వెంచర్ క్యాపిటల్ నిధులు సమకూర్చనుంది. భారత్ లో మొదటి ప్రైవేట్ రాకెట్ టి హబ్ నుంచే వచ్చింది. ధ్రువ స్పేస్ సైతం హైదరాబాద్ నుంచి వచ్చి ప్రయోగంలోనే నానో రాకెట్స్ ని విజయవంతంగా నింగిలోకి పంపిందని కేటీఆర్ గుర్తు చేశారు.