ఆలోచనలకి రూపం తెల్లకాగితం పై ఇవ్వవచ్చు
అందమైన బొమ్మకు ప్రాణం తెల్లకాగితం పై పోయవచ్చు
రాయాల్సింది గియాల్సింది తెల్ల కాగితం పైనే
విషయం ఏదైనా కావచ్చు
విషయం ఎంతదైనా కావచ్చు
విషయం చాలా ఉండవచ్చు
విషయం చిన్నదైనా కావచ్చు
ఏ విషయమైనా రాయాల్సింది తెల్ల కాగితం పైనే
ప్రతి శుక్రవారం వినండి
శ్వేత పత్రం with శ్వేతా \
నా పేరు శ్వేత అలియాస్ సునీత . భుక్తి కొరకు ఐటీ రంగం లొ యుద్దాలు , ముక్తి కొరకు గురుదేవుని ప్రవచన గీతాలు !! ఈ రెండితి మధ్యలొ అప్పుడప్పుదు సినిమా పాటలు. హాస్య పుస్తకాలు చదవటం, వంట చేయటం…ఇదీ సంక్షిప్తం గా నా ఇష్టాల జాబితా ! ఇంతేనా అని అనుకోకండి, లిస్టు పెద్దది కేటాయించిన పేజీ చిన్నది..అన్నీ తెలుసుకోవాలంటే మరి నేను మాట్లాడే టాపిక్స్ వినండి, నాకు తెలిసినవి చెబుతాను, తెలియనివి మీరు చెబితె విని తెలుసుకుంటాను !!
మోటో : చిన్న జీవితం, చిన్న చితక చింతలు ఉన్న జీవితం, ధైర్యం గా ఎదురీది గెలవాలి ( మచ్చుకి ఒకటి మత్రమే ఇక్కడ చెప్పడం, ఇలాంటివి కో కొల్లలు ఉన్నాయి)