తెలంగాణ హైకోర్టులో ఈరోజు నూతనంగా నియమితులైన జడ్జిలు ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం 10.45 గంటలకు కోర్టు హాల్ లో వీరి చేత చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ప్రమాణం చేయించారు. హైకోర్టు న్యాయమూర్తులుగా నగేష్ భీమపాక, ఏనుగుల వెంకట వేణుగోపాల్, కాజ శరత్, పుల్ల కార్తీక్ లు.. అదనపు న్యాయమూర్తులుగా రాజేశ్వరరావు, శ్రీనివాసరావులు ప్రమాణం చేశారు.