తెలంగాణలోని వివిధ ప్రాంతాలలో ఆర్ఎస్ఎస్ స్వయంసేవక్ లు సేవాసప్తాహం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆయా ప్రాంతాలలోని ప్రజా బాహుళ్యానికి ఉపయోగపడే అంశాలను ఎంచుకొని సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్యంగా ప్రజారోగ్యం పారిశుద్ధ్యం పరిశుభ్రత అంటే అంశాల మీద దృష్టి పెడుతున్నారు. ఫలితంగా స్థానిక సమాజానికి ప్రత్యక్షంగా ఉపయోగపడుతున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా
లక్ష్మణచందా ఖండ లోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సోన్ శాఖ ఆధ్వర్యంలో సేవా సప్తాహ నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సోన్ గ్రామంలోని వీర హనుమాన్ మందిర్ దగ్గర శ్రమ సేవా ద్వారా పరిసర ప్రాంతాలను శుభ్రం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత సహ సేవా ప్రముఖ్ బలవత్రి గణేష్ జీ, ఖండ సహ కార్యవాహ ఆకారపు చిన్నయ్య, ఖండ వ్యవస్థ ప్రముఖ్ ఎడ్డేడి వెంకటేష్, సహ శారిరక్ ప్రముఖ్ తోట నవీన్, సహ బౌద్ధిక్ ప్రముఖ్ వినోద్, స్వయం సేవకులు పాల్గొన్నారు.