ద్వారకాపీఠాధిపతి స్వామీ స్వరూపానంద సరస్వతి శివైక్యం చెందారు. మధ్యప్రదేశ్ లోని నర్సింగపూర్లోని శ్రీధామ్ జ్యోతేశ్వర్ ఆశ్రమంలో ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు.ఆయన వయసు 99 ఏళ్లు. జగద్గురు ఆదిశంకరాచార్యులు స్థాపించిన నాలుగు పీఠాల్లో ద్వారకా పీఠం ఒకటి. స్వరూపానందస్వామి ఆ పీఠానికి అధిపతిగా ఉన్నారు. భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లిన స్వామీజీ… అయోధ్య ఉద్యమంలోనూ పాల్గొన్నారు.కశ్మీర్ నుంచి ఆర్టికల్ 370 ని రద్దు చేయాలని పలువేదికలపై గళమెత్తిన స్వామిని విప్లవస్వామి అని పిలిచేవారు.