హైదరాబాద్ బండ్లగూడ జాగీర్ లోని శ్రీ విద్యారణ్య ఇంటర్నేషనల్ స్కూల్లో నందనవనంగా మారింది. ఆచార్యులు మాతాజీలు సిబ్బంది మరియు విద్యార్థులు కలిసి గురు పౌర్ణమి వేడుక నిర్వహించారు. రేపటి తరం పౌరులను తీర్చిదిద్దడంలో గురువుల పాత్రను గుర్తు చేస్తూ వేడుక జరిగింది.
…….
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీ సరస్వతీ విద్యాపీఠం సంఘటనా కార్యదర్శి పతకమూరి శ్రీనివాసరావు రాష్ట్ర సేవిక సమితి ముఖ్యులు రమాదేవి విచ్చేశారు. సరస్వతీ మాతను పూజించి గురు రూపంలో దైవం ఆశీస్సులు అందుకొన్నారు.
గురుపూజ స్ఫూర్తితో అతిథులకు విద్యార్థులు పూజ నిర్వహించి వినయ విధేయతలు చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కార్యదర్శి విశ్వేశ్వరరావు, కమిటీ సభ్యులు వెంకటస్వామి, ప్రిన్సిపాల్ కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.
……….
ఈ సందర్భంగా పాఠశాల తరగతులను సంఘటనా మంత్రి పథకమురి శ్రీనివాసరావు పరిశీలించారు. విలువలతో కూడిన విద్యను అందించడంలో ముందు వరసలో ఉండే స్విస్ విద్యాసంస్థ.. తరగతుల నిర్వహణలో నిబద్ధతతో ఉంటుంది . భారతీయ విలువలు సంప్రదాయాన్ని బోధిస్తూనే ,,,ఆధునిక ఇంటర్నేషనల్ పాఠశాలలకి ధీటుగా స్విస్ సంస్థ పనిచేస్తోంది.
…..
ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ మార్గదర్శనం చేశారు