అమెరికా స్పీకర్ నాన్సీ పెలోసి పర్యటనతో చైనా, తైవాన్ ల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. తాజాగా తైవాన్ రక్షణ శాఖ లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగానికి చెందిన డిప్యూటీ హెడ్ ఒయూ యాంగ్ లి-హిసింగ్ తైవాన్ లోని పింగ్ టంగ్ లో ఒక హోటల్ లో శవమై కనిపించారు.
సైనిక యాజమాన్యంలోని నేషనల్ చుంగ్-షాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిప్యూటీ హెడ్ అయిన 57 ఏళ్ల ఒయూ యాంగ్ లి-హిసింగ్ హోటల్ లో శవమై కనిపించినట్లు తైవాన్ అధికారిక సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ ఈరోజు నివేదించింది. కాగా అతని మరణానికి కారణాలు ఇంకా తెలియలేదు, దర్యాప్తు కొనసాగుతోంది. ఆయన అనేక క్షిపణి ఉత్పత్తి ప్రాజెక్టులను పర్యవేక్షించాడు.. వ్యాపార పర్యటన కోసం పింగ్ టంగ్లో ఉన్నాడు.