మేడ్చల్ జిల్లా మైసమ్మగూడ మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ఓ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కాలేజీ సమీపంలోని వసతి గృహం పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో ఆమె మృతదేహం లభ్యమైంది. మృతురాలు నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందినట్లు తెలుస్తుండగా.. ప్రస్తుతం మల్లారెడ్డి ఇంజినీరంగ్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతోంది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.