బుద్ధగయలో చైనా మహిళ అనుమానాస్పద కదలికలు కలకలం రేపుతున్నాయి. ముఖ్య కార్యక్రమాల కోసం…బౌద్ధగురువు దలైలామా బుద్దగయ చేరుకున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో గుర్తుతెలియని మహిళ కదలికలపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.ఆమె కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. అయితే ఆమె పాస్ పోర్ట్ , వీసా వివరాలను బయటపెట్టారు. దలైలామాకు హాని తలపెట్టేందుకే ఆమె చైనానుంచి వచ్చిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వార్షిక పర్యటనలో భాగంగా ఈనెల 22 న దలైలామా బుద్దగయ వచ్చారు. ఆయన దర్శనం కోసం పెద్దఎత్తున విదేశాలనుంచి భక్తులు తరలివస్తున్నారు.