75 స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా జనవరి 1 నుంచి 7 వరకు పాఠశాలల్లో సూర్య నమస్కారాలు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలపై ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆభ్యంతరం వ్యక్తం చేసింది. మెజారిటీ కమ్యూనిటీ ఆచారాలను అన్ని మతాలపై ఎలా రుద్దుతారని బోర్డు పర్సనల్ ప్రధాన కార్యదర్శి మౌలానా ఖలీఫ్ సైఫుల్లా రహ్మానీ ఓ ప్రకటన విడుదల చేశారు. సూర్య నమస్కారాలు పాఠశాల విద్యార్థులు దూరంగా ఉండాలని ఆదేశించారు.
“ఇతర మతాల విద్యార్థులకు ఇబ్బందులు కలిగించే ఇలాంటి కార్యక్రమాన్ని పాఠశాలల్లో అస్సలు నిర్వహించకూడదు. జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టాలి. ముస్లిం విద్యార్థులు తమ పాఠశాలల్లో నిర్వహించే సూర్య నమస్కార కార్యక్రమాలను బహిష్కరించాలి. అలాంటి కార్యక్రమంలో పాల్గొనడానికి ఇస్లాం వారిని అనుమతించనందున వారు అలాంటి కార్యక్రమానికి హాజరుకాకుండా ఉండాలి” అని లేఖలో పేర్కొన్నారు ఖలీఫ్ సైపుల్లా.
కేంద్రం సెక్యులరిజం మార్గం నుంచి దూరమవుతోందని, దేశంలోని పాఠశాలల్లో నిర్వహించనున్న ‘సూర్య నమస్కార్’ కార్యక్రమాన్ని దేశభక్తి కార్యక్రమంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఆదేశం రాజ్యాంగ విరుద్ధమనీ అన్నారు. ఇస్లాంలో సూర్యుడిని దేవుడిగా పూజించడం అనుమతించబోమని స్పష్టం చేశారు.
“75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, భారత ప్రభుత్వ కార్యదర్శి ఆధ్వర్యంలో, విద్యా మంత్రిత్వ శాఖ రాష్ట్రాలలో సూర్య నమస్కార్ ప్రాజెక్ట్ను అమలు చేయాలని నిర్ణయించింది. మొదటి దశలో 30 వేల పాఠశాలలుంటాయి.