శివసేన ఎంపీ సంజయ్ రౌత్ , ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలేతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోను స్వయంగా సుప్రియీసూలే తన ఇన్ స్టాలో షేర్ చేశారు.
సంజయ్ రౌత్ కుమార్తె వివాహం వేడుకలో భాగంగా నిర్వహిస్తున్న సంగీత్ ఇందుకు వేదికైంది. సూపర్ హిట్ సాంగ్ లంబోర్గినీ కి ఇద్దరూ డ్యాన్స్ చేశారు.
సంజయ్ రౌత్ కుమార్తె పూర్వశి రౌత్ వివాహం సోమవారం జరగనుంది. అందులో భాగంగా నిన్న జరిగిన సంగీత్ కు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇక రౌత్, సుప్రియా వీడియోకు ఇన్ స్టా, ఫేస్ బుక్ లో నెటిజన్లు సరదా కామెంట్లు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. రౌత్ అభ్యర్థన మేరకు సుప్రియా ఆయనతో డ్యాన్స్ చేశారు. రౌత్ భార్య వర్షా కూడా అక్కడే ఉన్నారు.
Video Courtesy : Zee 24 Taas Channel